జగన్ పొలిటికల్ క్లాసులు.. ఫలించేనా ..!
తాజాగా 'వెన్నుపోటు దినం' నిర్వహించారు. కర్నూలులో హిట్టు, మిగిలిన చోట ఫట్టు! అన్నట్టుగానే ఇది సాగింది.
By: Tupaki Desk | 5 Jun 2025 8:48 PM ISTవైసీపీ అధినేత జగన్.. జగన్ పొలిటికల్ క్యాలెండర్.. ఎలా ఉంది? అంటే.. కేవలం తాడేపల్లికి పరిమితం కావడం.. నాయకులను దరికి పిలుచుకుని వారికి ఓ గంట క్లాసు పీకడం.. హోం వర్కులు.. ఇంపోజిషన్ పేరిట కొన్ని టాస్కులు ఇవ్వడం వదరకే ఆయన పరిమితం అవుతున్నారు. అయితే.. ఇది ఎంత వరకు వర్కువుట్ అవుతుందన్నది మాత్రం ఆయన అంచనా వేయలేక పోతున్నారు. పార్టీ కేడర్.. నాయకులు.. కూడా దీనిని హర్షిస్తున్నారా? అంటే.. పెద్ద ప్రశ్నగానే మిగులుతుంది.
తాజాగా 'వెన్నుపోటు దినం' నిర్వహించారు. కర్నూలులో హిట్టు, మిగిలిన చోట ఫట్టు! అన్నట్టుగానే ఇది సాగింది. ఎక్కడా ఊపు.. రాలేదు. వచ్చిన వారు కూడా ఎక్కువగా సమయం ఇవ్వలేక పోయారు. పైగా.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుప్పకూలిన తర్వాత.. సీనియర్లు అందరూ ఆరోగ్య భద్రతలో భాగంగా.. ఇంటి ముఖం పట్టారు. తద్వారా.. ఈ కార్యక్రమం హిట్ కంటే.. ఫట్ అంచునే చేరింది. పైగా.. ఏ పార్టీ అయినా.. నిరంతరం ప్రజల మధ్య ఉండాలి.
ఈ విషయంలో వైసీపీ గత ఏడాది కాలంలో విఫలమైంది. కేవలం తాడేపల్లికి పరిమితం కావడం.. తన వారి ని పరామర్శించడం.. తాజాగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను పరామర్శించ డం వరకే పరిమితం అయ్యారు. ఇది రాజకీయంగా జగన్ గ్రాఫ్‌ను మరింత మెలి తిప్పిందే కానీ.. ఎగబాకే లా అయితే.. చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పొలిటికల్ క్లాసులకు సమయం లేదు. నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు కూడా ఇంటి దగ్గరే ఉంటానని చెబితే.. బెంగళూరుకే పరిమితం అవుతానని అంటే.. ఇక, జగన్‌ను కాపాడే నాథుడు ఎవరూ లేరు. ఏపీ విభజన తర్వాత.. జగన్ రెండు సార్లు ఓడితే.. వైసీపీ నాయకులు రోజూ ఓడుతున్నారన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. నిర్దిష్టమైన విధానాలు.. పక్కా ప్రణాళికలు లోపించిన పార్టీలో ఇప్పటికే చాలా మంది నాయకులు దూరమయ్యారు. ఇక, మిగిలిన వారు కూడా అవకాశం లేక ఉన్నారన్న విషయాన్ని జగన్ గుర్తించాల్సిన గుర్తెరగాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. సో.. ఇప్పటికి జరిగిన క్లాసులు చాలు.. ఇక, దూకుడు పెంచాల్సిందేనన్న చర్చ కూడా నాయకుల మధ్య కనిపిస్తోంది. వినిపిస్తోంది కూడా!.
