'వెన్నుపోటు'పై భిన్నాభిప్రాయాలు.. పాపం వైసీపీ ..!
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా ఉంది వైసీపీ పరిస్థితి. వెన్నుపోటు దినం పేరుతో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని పార్టీ పిలుపునిచ్చింది
By: Tupaki Desk | 7 Jun 2025 1:00 AM ISTచేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న చందంగా ఉంది వైసీపీ పరిస్థితి. వెన్నుపోటు దినం పేరుతో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని పార్టీ పిలుపునిచ్చింది. దీనిలో కొందరు పాల్గొన్నారు. కొందరు దూరంగా ఉన్నారు. అయితే.. అసలు ఈ వ్యవహారంపై తాజాగా భిన్నాభిప్రాయాలు తెరమీదికి వచ్చాయి. సొంత పార్టీలోనే నాయకులు.. కొందరు ఇప్పటికిప్పుడు ఇలా చేయడం వల్ల ఎలాంటి గ్రాఫ్ పెరగలేదని చెబుతున్నారు.
అంతేకాదు.. పార్టీలో మేధావి వర్గంగా ఉన్న వారు కూడా.. ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అంత వ్యతిరేకత రాలేదని.. సో.. ఇప్పుడు ఇలా వెన్నుపోటు దినం వంటివాటిని నిర్వహించడం వల్ల.. ప్రయోజనం కన్నా.. పేరు పోగొట్టుకోవడమే అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఈ ప్రతిపాదన తెరమీదికి వచ్చినప్పుడు.. ఎవరూ నోరు విప్పలేదు. మరి వారు ఏమనుకున్నారో.. ఏమో తెలియదు కానీ.. పార్టీ అధినేత జగన్‌కు ఇది మంచి-ఇది చెడు అని చెప్పే సాహసం చేయలేకపోయారు.
అంతా అయిపోయిన తర్వాత.. మాత్రమే నాయకులు స్పందించారు. దీనికి కారణం ఉంది. జాతీయ మీడి యాలో ప్రభుత్వ తీరుపై కొన్ని విశ్లేషణలు వచ్చాయి. వాటిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతెన్నులు.. వైసీపీ చెబుతున్నట్టు నిజంగానే ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేసిందా? అనే రెండు కోణాలపై మేదావులు విశ్లేషించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆశించినట్టు లేదా.. ఆ పార్టీ అధినేత భావిస్తున్నంత రేంజ్‌లో ప్రజల్లో వ్యతిరేకత లేదని జాతీయ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబులపై ప్రజల్లో విశ్వాసంఉందని.. అది సడలిపోలేదని.. ఈ సమయంలో వైసీపీ ఇంత పెద్ద పేరుతో `వెన్నుపోటు` కార్యక్రమం నిర్వహించకుండా ఉంటే బాగుండేద న్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయనందున కొంత అసంతృప్తి అయితే.. ప్రజల్లో నాటుకుంటోందని.. దీనిని వైసీపీ అందిపుచ్చుకుని ప్రాధమిక నిరసన పేరుతో ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుండేదని చెప్పారు. ఈ విషయంపై వైసీపీలోని మేధావి వర్గం చర్చించింది. కానీ.. ఏం చేస్తారు..? అంతా అయిపోయింది. గ్రాఫ్ మాత్రం పెరగలేదట..!
