అమరావతి రాజధాని...ఆయనకే అప్పగించిన జగన్ ?
అమరావతి రాజధానిని టేకప్ చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం కదా. వైసీపీకి ఏమి సంబంధం అని అంతా అనుకోవచ్చు.
By: Tupaki Desk | 6 May 2025 7:00 AM ISTఅమరావతి రాజధానిని టేకప్ చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం కదా. వైసీపీకి ఏమి సంబంధం అని అంతా అనుకోవచ్చు. అమరావతి ఇపుడు ఏపీలో హాట్ టాపిక్. పైగా దానిని ఎంతో ప్రెస్టీజియస్ గా టీడీపీ కూటమి తీసుకుంది. మూడేళ్ళ గడువు పెట్టుకుని పూర్తి చేయాలని అనుకుంటోంది. కేంద్రం నుంచి మోడీ వచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.
ఇక అమరావతి రాజధాని దూకుడే అని అంతా అంటున్నారు. అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ డౌట్లు దానికి ఉండనే ఉన్నాయి. అమరావతి రాజధాని చెప్పిన టైం కి పూర్తి చేస్తామని కూటమి సర్కార్ పెద్దలు చెప్పినా కూడా బిగ్ స్కేల్ లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందా లేదా అన్న సందేహాలు కూడా వైసీపీలో ఉన్నాయి.
ఇక అమరావతి విషయంలో రైతులలో అసంతృప్తి ఉందని కూడా వైసీపీ భావిస్తోందిట. 34 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మరో 40 వేల ఎకరాల భూముల సేకరణ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. ఇది అమరావతి రైతులకు నచ్చడం లేదు అని అంటున్నారు.
అమరావతి రాజధాని పేరిట అవినీతి అంతులేనిదిగా సాగుతోంది అన్నది వైసీపీ భావన, ఒక కిలోమీటర్ రోడ్డుకి ఏకంగా 59 కోట్లు తీసుకుంటున్నారని ఇది కేంద్రం జాతీయ రోడ్డుకు వెచ్చిస్తున్న 20 కోట్ల కంటే మూడింతలు ఎక్కువ అని అంటున్నారు. అంతే కాదు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇస్తున్నారని వాటిని తమకు అయిన వారికి కావాల్సిన వారికే ఇస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు.
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని ప్రాంతం అన్నది ముంపునకు గురి అవుతుందని అలాగే భద్రతాపరంగా ఇబ్బందులు వస్తాయని కూడా విమర్శిస్తున్నారు. ఇలా అమరావతి విషయంలో పైపైకి కనిపించే అంశాలే కాకుండా లూప్ ఫోల్స్ ని పట్టుకోవాలంటే పక్కా లోకల్ లీడర్ స్ట్రాంగ్ లీడర్ ఉండాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది.
గతంలో అంటే 2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం హయాంలో అమరావతిలో ప్రతీ చిన్న దానిని ఇష్యూగా చేసి మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టుల ద్వారా కేసులు వేసి మరీ పోరాడేవారు. అలా కోర్టులలో ఆ కేసులు నిలబడకపోయినా ప్రజా బాహుళ్యంలో చర్చకు వచ్చి అమరావతి రాజధాని విషయంలో కొన్ని అనుమానాలకు తావు ఇచ్చేలా చేసింది.
దాని వల్ల రాజకీయంగా వైసీపీ కూడా లబ్ది పొందింది. ఈసారి కూడా సరిగ్గా అలాంటి ఫార్ములానే వైసీపీ ఎంచుకోవాలని చూస్తోందిట. దానికి సరైన వ్యక్తిగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డినే వాడుకోవాలని అనుకుంటోందిట. ఆయనకు సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది పైగా దానిని ఆయన స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తారు. అందుకే మరోసారి ఆయనను ముందు పెట్టి అమరావతి విషయంలో ప్రభుత్వం చేసే తప్పులు అంటూ బదనాం చేయడానికి వైసీపీ రెడీ అవుతోందిట.
అయితే ఆళ్ళ రాజకీయాల పట్ల విరక్తితో ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా ఓటమి పాలు అయ్యారు ఇక ఆళ్ళను సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి దాంతో ఆయన ఎందుకొచ్చిన రాజకీయం అని భావించి తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ఇపుడు ఆయనకే మంగళగిరి వైసీపీ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్నది వైసీపీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. మరి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది.
