వైసీపీకి పొత్తు తప్పదా.. జగన్ టాక్ ఇదేనా... !
ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీకి పేరుంది. ఎంత భీకర సమరం జరిగినా.. తాము ఒం టరిగానే ముందుకు సాగుతామని ఆ పార్టీ అధినేత గత ఎన్నికల్లోనే తేల్చి చెప్పారు
By: Tupaki Desk | 1 July 2025 2:45 AMఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీకి పేరుంది. ఎంత భీకర సమరం జరిగినా.. తాము ఒం టరిగానే ముందుకు సాగుతామని ఆ పార్టీ అధినేత గత ఎన్నికల్లోనే తేల్చి చెప్పారు. ఇది ఇప్పుడు మాత్ర మే కాదు.. 2012, 2014 ఎన్నికల్లోనూ కనిపించింది. వాస్తవానికి 2014, 2024 ఎన్నికలు వైసీపీ క్రూషియ ల్. ఎందుకంటే.. ఆ పార్టీ విజయాన్ని శాసించింది.. ఆ ఎన్నికలే. పైగా రాష్ట్రంలో బీజేపీ-జనసేన-టీడీపీలు పొత్తులు పెట్టుకున్నది కూడా ఆ ఎన్నికల్లోనే.
అయితే.. ఆ పొత్తులను జగన్ లైట్ తీసుకున్నారు. ....గుంపులుగా వస్తాయని, సింహం సింగిల్‌గానే వస్తుం దని ఆయన ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు.. ఆయా పార్టీలను కూడా పొత్తులు పెట్టుకోకుండా.. తెరచాటున ప్రయత్నాలు కూడా చేశారు. కానీ, ఫలించలేదు. ఆ మూడు పార్టీలు కలిసే ఉన్నాయి. అంటే.. పొత్తులు పెట్టుకున్న ప్రతిసారీ జగన్ పరాజయం పాలయ్యారు. ఆ మూడు పార్టీలు కలిసి ఉన్న పరిస్థితి ఉంటే.. అది జగన్‌కు ఎప్పుడూ ఎఫెక్ట్ చూపిస్తూనేఉంది.
దీంతో ఇప్పుడు వ్యూహం మార్చి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేయాల న్నది కేతిరెడ్డి వంటి యువ నాయకులతోపాటు.. బొత్స సత్యనారాయణ వంటివారు కూడా అంతర్గత సమావేశాల్లో సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు.. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. ఈ విషయాన్నే అడిగారు. ``వచ్చే ఎన్నికల్లో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా?`` అని నేరుగా జగన్‌ను ఆమె ప్రశ్నించారు. అయితే.. దీనిపై జగన్ నర్మగర్భంగా స్పందించారు.
``ఈ విషయం నాకు వదిలేయండి. మనం ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నామా?`` అని ప్రశ్నిస్తూనే.. ఇంకా ఎన్నికలకు సమయం ఉందని.. అప్పుడు చూద్దామని జగన్ వ్యాఖ్యానించారు. కానీ, మెజారిటీ నాయకుల్లో మాత్రం.. పొత్తు పెట్టుకుంటే తప్ప.. అనే మాట వినిపిస్తోంది. ``పొత్తు తప్పు కాదు. నేరం అంతకన్నా కాదు.`` అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. అలానే.. బొత్స కూడా.. రాజకీయాల్లో కలిసి వెళ్తే తప్పేంటి? అని ప్రశ్నించారు.
అంటే..బీజేపీ-జనసేన-టీడీపీ కూటమిని ఇప్పటి వరకు విమర్శించినా.. మారుతున్న రాజకీయా లకు అనుగుణంగా తాము కూడా మారాల్సిన అవసరం ఉందన్నది వీరు చెబుతున్న మాట. ఒక వేళ ఇదే నిజమైతే.. వైసీపీతో కలిసి వచ్చే పార్టీలు ఏంటనేది చూడాలి. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కదా!!. కాబట్టి వేచి చూడాలి.