బాబు ఫస్ట్ పొలిటికల్ పుట్టిన రోజు.. అతిథి తెలిస్తే ఆశ్చర్యం!
నేడు టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు అత్యంత ఘనంగా నిర్వహి స్తున్నారు.
By: Tupaki Desk | 20 April 2025 4:05 PM ISTనేడు టీడీపీ అధినేత చంద్రబాబు 75వ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముళ్లు అత్యంత ఘనంగా నిర్వహి స్తున్నారు. అసలు వస్తుందా రాదా.. అన్నట్గుగా ఉన్న పార్టీని 2024లో అధికారంలోకి తీసుకువచ్చారు. భవిష్యత్తుపైనా పట్టు బిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పుట్టిన రోజుకు అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలావుంటే.. అసలు చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఫస్ట్ పుట్టిన రోజు ఎక్కడ నిర్వహించు కున్నారో తెలిస్తే.. ఆశ్చర్యం వేస్తుంది.
సుమారు 1980లలో చంద్రబాబు రాజకీయ ప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాస్తవానికి చంద్రబాబు పుట్టిన రోజు చేసుకోవాలని కానీ.. పుట్టిన రోజు గురించి కానీ.. ఆయన ఆలోచించడమే లేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా చంద్రబాబు విషయాన్ని అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టించుకున్నారు. ఇద్దరూ మిత్రులే కావడంతో.. చంద్రబాబు పుట్టిన రోజును ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నారు.
అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉండగా.. చంద్రబాబు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. దీంతో చంద్రబాబు సీమ వాడని.. ఆయన పుట్టిన రోజును ఘనంగా చేయడం ద్వారా.. సీమలో కాంగ్రెస్‌పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి.. రాజకీయంగా తొలి పుట్టిన రోజును 1982, ఏప్రిల్‌లో చిత్తూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పటి సీఎం కూడా పాల్గొన్నారు. ఇలా.. చంద్రబాబు రాజకీయ జీవితంలో తొలి పుట్టిన రోజును వైఎస్ నిర్వహించడం.. గమనార్హం.
