Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... ఏపీకీ ఇతర రాష్ట్రాలకూ తేడా చెబుతున్న వీడియో ఇది!

అవును... ఏపీలో జగన్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందనేది బలంగా వినిపించేమాట

By:  Tupaki Desk   |   31 Dec 2023 6:26 AM GMT
వైరల్ ఇష్యూ... ఏపీకీ ఇతర రాష్ట్రాలకూ తేడా చెబుతున్న వీడియో ఇది!
X

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయనేది తెలిసిన విషయమే. ఈ విషయాన్ని జగన్ ని అభిమానించేవారు బహిరంగంగా చెబితే... జగన్ రాజకీయ ప్రత్యర్థులు తెరవెనుక చెబుతుంటారు. ఎవరు ఎలా చెప్పినా.. మార్పు ఐతే ఏపీ స్పష్టంగా కనిపిస్తుందనేది ఫైనల్ గా అంతా చెప్పేమాట. ఇది ప్రధానంగా మొదలైంది వాలంటీర్ల వ్యవస్థ నుంచి అని అంటారు.

అవును... ఏపీలో జగన్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిందనేది బలంగా వినిపించేమాట. పైన చెప్పుకున్నట్లు ఎవరు బహిరంగంగా చెప్పినా.. ఎవరు ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానించినా ఆ విషయం మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు ఏపీలో మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. తాజాగా రేషన్ కార్డుల కోసం మీసేవా సెంటర్స్ వద్ద క్యూకట్టిన జనాలను చూస్తే ఇది మరింత స్పష్టంగా అర్ధమయ్యే అవకాశం ఉంది.

ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకోవడానికి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఫారంలను విడుదల చేసింది. ఇదే సమయంలో కొత్త రేషన్ కార్డులకు కూడా ధరఖాస్తు చేసుకోమని తెలిపింది. దీంతో... ఒక్కో ఈసేవా కేంద్రం వద్ద వందల సంఖ్యలో జనాలు వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా ముసలీ ముతకా అంతా క్యూ కట్టారు! ఆ క్యూలు కూడా భారీగా ఉండటం గమనార్హం.

ఇక ఈసేవా కేంద్రం షట్టర్ ఓపెన్ చేసేవరకూ బయట వందల సంఖ్యలో క్యూ కట్టిన ప్రజానికం... డోర్స్ తెరిచిన వేంటనే ఒకేసారి లోపలికి వచ్చే ప్రయత్నంలో భాగంగా తొక్కిలసాలాటలు సైతం జరుగుతుండటంతో ఎంతో విచారకరమైన విషయం! అయితే ఏపీలో ఇలాంటి విషయాల్లో ప్రజల పరిస్థితి ఎంత సౌకర్యవంతంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వకముందు... బర్త్, డెత్, క్యాస్ట్.. ఇలా ఏ సర్టిఫికెట్ కావాలాన్నా అదో పెద్ద ప్రహాసనం! ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరగడం, అదో పెద్ద డ్యూటీలా భావించి నాలుగైదు రోజులు అదేపనిమీద ఉండటం.. ఇక రేషన్ కార్డు సంగతైతే చెప్పే పనేలేదు! అయితే... జగన్ వచ్చాకా పాలన పూర్తిగా మారిపోయింది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా.. వాలంటీర్ ఇంటివద్దకు వచ్చి ఇచ్చి వెళ్లే పరిస్థితి.

ఇక పగలంతా పనులకు పోయి.. సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చి.. తిరిగి సంచి చేతపట్టి రేషన్ షాపులకు కాళ్లు ఈడ్చుకుంటూ వెళ్లి.. క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి లేదు. ఇంటిముందుకు రేషన్ వ్యాన్ వస్తుంది. ఇక భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో కరెక్షన్లతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమి కావాలన్నా గ్రామసచివాలయం అని ఒక వ్యవస్థ ఉంది. స్థానికంగా ఎలాంటి సమస్యకైనా అధికారికంగా అక్కడ ఇట్టే పరిష్కారం లభిస్తుంది.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో రేషన్ కార్డుల కోసం బారులు తీరి.. గంటలు తరబడి నిలబడలేక వారి స్థానంలో వారి వారి పాదరక్షలు లైన్లో పెట్టి.. చెట్టుకిందకు వెళ్లి సేదతీరుతున్న పరిస్థితి చూస్తే... ఏపీలో జగన్ తీసుకొచ్చిన మార్పు ఏమిటనేది స్పష్టం అవుతుంది. అయితే ఈ సమస్య తెలంగాణలో మాత్రమే కాదు.. ఆల్ మోస్ట్ దేశవ్యాప్తంగా ఇలానే ఉందనేది తెలిసిన విషయమే. దీంతో ఏపీలో జగన్ పాలనను ఇతర రాష్ట్రాల పాలనతో కంపేర్ చేస్తూ… మార్పు అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలని ముఖ్యమంత్రి అని జగన్ ని ప్రశంసితున్నారు.

ఈ విషయాన్ని కూడా ఆయనను అభిమానించేవారు ఆన్ ద రికార్డ్ చెబుతుంటే... రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఆఫ్ ద రికార్డ్ జగన్ పాలను అభినందిస్తుంటారు.