Begin typing your search above and press return to search.

జగన్ చివరి క్యాబినెట్ మీట్...సంచలనాలేనా...!?

By:  Tupaki Desk   |   4 March 2024 4:51 AM GMT
జగన్ చివరి క్యాబినెట్ మీట్...సంచలనాలేనా...!?
X

ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం అయినా ఆఖరులో చేసే పనులే చాలా ఉంటాయి. అవి చివరి ప్రయత్నాలుగా కూడా ఉంటాయి. అందులో వ్యూహాలు కూడా ఇమిడి ఉంటాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రస్తుత అధికార కాలానికి సంబంధించి చివరి క్యాబినెట్ మీటింగ్ ని తాజాగా నిర్వహించింది. అందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ సమావేశం జరిగింది అని అంటున్నారు.

ఇక ఇదే తరహాలో ఏపీలో కూడా ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన చివరి మంత్రివర్గ సమావేశం ఈ నెల 6న జరగనుంది అని అంటున్నారు. ఆ మీటింగులో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని చెబుతున్నారు. కొన్ని ఎన్నికల వరాలను ముందే మంత్రివర్గంలో పెట్టి అమలు చేయడానికి చూస్తారు అని అంటున్నారు.

ఏపీలో ఉచితాలను చాలా పెంచాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రస్తుతం ఉన్న పధకాలలోనే కొన్నింటికి ఇస్తున్న నగదుని మరింతగా పెంచాలని చూస్తోంది. వాటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటే కనుక అది ఎన్నికల్లో వైసీపీకి ఉపయోగపడుతుందని లెక్క వేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పీఆర్సీ లేట్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇచ్చే విషయం కూడా మంత్రివర్గంలో ప్రస్తావనకు రావచ్చు అంటున్నారు. ఈసారి భారీ ఎత్తున ఉద్యోగులకు ప్రయోజనం కలిగించేలా చూస్తారు అని అంటున్నారు. అదే విధంగా నిరుద్యోగ యువతతో పాటు అర్బన్ ఓటర్ల విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

అదే సమయంలో చూస్తే ఆర్ధిక సంబంధించిన అంశాలు కాకుండా కొన్ని ఇతర నిర్ణయాలు కూడా తీసుకునే వీలుంది. కొన్ని ముఖ్య ప్రకటనలు ప్రభుత్వం చేయాలనుకున్నా పరిపాలనా సంబంధితమైన ఆదేశాలు జారీ చేయాలన్నా కూడా ఈ మంత్రివర్గ సమావేశంలోనే చర్చిస్తారు అని అంటున్నారు. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 2019 జూన్ రెండవ వారంలో తొలి క్యాబినెట్ మీటింగ్ జరిగింది.

ఇపుడు సరిగ్గా యాభై ఏడు నెలలు ముగిసిన తరువాత చివరి క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ మీద సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. చాలా మంది ఆశగా చూస్తున్నారు. కొన్ని కీలక వర్గాలు కూడా ప్రతిపాదనలు పంపిస్తున్నారు. మరి మంత్రివర్గం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది చూడాలి. ఇక చూస్తే మార్చి 10 తరువాత ఏ నిముషాన అయినా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.