Begin typing your search above and press return to search.

వివేకా హత్యకు ఏడేళ్ళు...మిగిలింది కన్నీళ్లు

కన్న తండ్రిది దారుణ హత్య అన్నది తెలుసు. ఎవరు చేశారు అన్నది నిరూపించే ప్రయత్నంలో కూతురు ఎంతో శ్రమించి న్యాయ పోరాటం చేసింది. కానీ చివరికి వారికి మిగిలింది కన్నీళ్ళు మాత్రమే అని అంటున్నారు.

By:  Satya P   |   15 March 2026 6:00 AM IST
వివేకా హత్యకు ఏడేళ్ళు...మిగిలింది కన్నీళ్లు
X

కన్న తండ్రిది దారుణ హత్య అన్నది తెలుసు. ఎవరు చేశారు అన్నది నిరూపించే ప్రయత్నంలో కూతురు ఎంతో శ్రమించి న్యాయ పోరాటం చేసింది. కానీ చివరికి వారికి మిగిలింది కన్నీళ్ళు మాత్రమే అని అంటున్నారు. ఒక ప్రముఖుడి హత్య జరిగితే ఈ రోజుకీ ఏమీ తేలకపోవడం హత్య ఎవరు చేశారు అన్నది ఒక మిస్టరీగా మారడం కంటే విషాదాంతం వేరొకటి ఉండదు.

సామాన్యుడు కారు :

వైఎస్ వివేకానందరెడ్డి సామాన్యుడు అయితే కారు. స్వయాన ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్సీగా పనిచేసిన వారు. అంతే కాదు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్సార్ కి అనుంగు తమ్ముడు. అంతే కాదు మాజీ సీఎం కి చిన్నాన్న. రాజకీయంగా ప్రముఖ కుటుంబం. దశాబ్దాలుగా పలుకుబడి కలిగి తాము ఉన్న ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన చోటనే పులివెందులలో తన సొంత ఇంట్లోనే వివేకా దారుణ హత్యకు గురి అయ్యారు. గొడ్డలి వేటుతో ఆయనను హంతకులు ప్రాణాలు తీశారు.

ఇప్పటికీ తెలియదు :

వివేకానందరెడ్డి 2019 మార్చి 14 అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లారితే మార్చి 15 అన్న మాట దారుణ హత్యకు గురి అయ్యారు. ఆయన హత్యకు గురి అయ్యారు అన్న సంగతి లోకానికి 15న పొద్దు పొద్దున్నే తెలిసింది.అది కూడా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ దారుణం జరిగింది. అయితే మొదట గుండెపోటుగా ప్రచారం జరిగినప్పటికీ పోలీసులు ఎంట్రీ ఇచ్చాక దారుణహత్యగా నిర్ధారించారు, ఇక ఈ కేసుని ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇక వివేకా ఏకైక కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసుని చేదించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం కోసం ఆమె పోరాడుతున్నారు. హత్య వెనుక ఉన్న పెద్ద కుట్రని వెలికి తీయాలని ఆమె ఆరాటపడుతున్నారు.

లేటెస్ట్ అప్డేట్స్ :

ఇక వివేకా హత్య కేసులో తాజా సమాచారం ఏంటి అంటే ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ముగిసిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో అదనంగా అనుమానితులు నిందితులు ఎవరూ లేరని కూడా ఆ మేరకు తగిన సాక్ష్యాలు లేవని అత్యున్నత న్యాయ స్థానానికి వివరించింది. దీంతో ఈ కేసుని సీబీఐ ట్రయల్ కోర్టు లో విచారణను వేగవంతం చేయాలని, నాలుగు వారాలలోగా ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అసలు దోషులు ఎవరు :

ఇక వివేకా హత్య కేసులో అసలు దోషులు ఎవరు అన్నది ఈ రోజుకీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. పాత్ర ధారులు సూత్ర ధారులు ఎవరు అన్నది మాత్రం తేలలేదు, సీబీఐ వంటి అత్యున్నత సంస్థ దేశంలోనే ఎన్నో కేసులను చేదించిన సంస్థ కూడా ఈ కేసులో ఉన్న పెద్ద కుట్రను చేదించలేకపోయిందా అన్న చర్చ అయితే సాగుతోంది అంతే కాదు ఆధారాలు లేవా లేక నాశనం అయ్యాయా లేక ఏమి జరిగి ఉండొచ్చు అన్నది కూడా చర్చగానే ఉంది. ఈ కేసులో అసలు నిజాలు ఏమిటి అన్నది ఇక ఎవరి ఆలోచనలకు ఊహకు వదిలేయాల్సిందేనా అన్నది కూడా ఉంది. ఈ హత్య జరిగినపుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ తరువాత అయిదేళ్ళ పాటు వైసీపీ ఉంది. ఇపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగి నాలుగేళ్ళకు పైగా విచారణ చేసింది అయినా అసలు దోషులు తేలకపోవడమే విషాదం అని అంటున్నారు.