Begin typing your search above and press return to search.

వైసీపీ తులాభారంలో విజయమ్మ కీలక నిర్ణయం ?

ఇక వైఎస్ షర్మిల వైసీపీకి వ్యతిరేకంగా మారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ప్రచారం వైసీపీకి షాక్ ఇచ్చింది. తల్లి చెల్లెలుకి జగన్ అన్యాయం చేశారు అన్నది జనంలోకి బలంగా వెళ్ళిపోయింది.

By:  Satya P   |   7 March 2026 8:58 AM IST
వైసీపీ తులాభారంలో విజయమ్మ కీలక  నిర్ణయం ?
X

వైసీపీ అన్న పార్టీ పేరులోనే వైఎస్సార్ ఉన్నారు. ఒక విధంగా వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయ అనివార్యతల నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ అంతా కలిసి కొత్త రాజకీయ దారి ఎంచుకుంటే పుట్టిన పార్టీగా వైసీపీని చూడాలి. ఆ విధంగా ఆలోచిస్తే ఆ పార్టీకి వైఎస్సార్ దీవెనలతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు కూడా నైతికంగా ఎంతో అవసరం అన్నది కూడా ఉంది అన్నది వాస్తవం అని విశ్లేషిస్తారు. 2014, 2019 ఎన్నికలే దానికి అచ్చమైన ఉదాహరణ. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కుటుంబం మొత్తం వైసీపీ వెనక ఉంది కాబట్టి మంచి నెంబర్ లో సీట్లు వచ్చాయని అంతా అంటారు. 2014లో వైసీపీ ఓటమి పాలు అయినా అసెంబ్లీలో 67 సీట్లతో బలమైన పార్టీగా అవతరించింది. ఇక 2019లో అయితే భారీ రాజకీయ తుఫాన్ వచ్చి ఏకంగా 151 అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.

బొమ్మ తిరగబడింది :

అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. దాంతో వైసీపీ రాజకీయ బొమ్మ తిరగబడింది. జస్ట్ 11 సీట్లకే పరిమితం అయింది. దానికి అనేకానేక కారణాలతో పాటు వైఎస్సార్ కుటుంబం దూరం కావడం కూడా అని అంతా విశ్లేషిస్తారు. వైసీపీకి ఎక్కడ దెబ్బ పడినా హార్డ్ కోర్ రీజియన్ గా ఉండే రాయలసీమ నాలుగు జిల్లాలు కొమ్ము కాస్తూ వస్తున్నాయి. అక్కడ సీట్లు సగానికి సగం అయినా ఏ ప్రతికూల పరిస్థితుల్లోనూ వస్తాయి. ఆ లెక్కన వైసీపీకి 35 దాకా సీట్లు గత ఎన్నికల్లో రావాల్సి ఉండేది. ప్రధాన ప్రతిపక్షంగా బలమైన పాత్రను పోషించే విధంగా వైసీపీ ఉండేది. కానీ వైఎస్సార్ కుటుంబంలో భారీ చీలిక వల్లనే సొంత గడ్డ సొంత జిల్లా ఆఖరుకు సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా వైసీపీకి దారుణంగా ఓట్లూ సీట్లూ తగ్గాయి అని అంటారు.

ప్రత్యర్థి గా మారి:

ఇక వైఎస్ షర్మిల వైసీపీకి వ్యతిరేకంగా మారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉంటూ చేసిన ప్రచారం వైసీపీకి షాక్ ఇచ్చింది. తల్లి చెల్లెలుకి జగన్ అన్యాయం చేశారు అన్నది జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. దానికి కూటమి కూడా బాగా వాడుకుంది. ఇక ఎన్నికలు పీక్స్ లో ఉండగా అమెరికాలో షర్మిల కొడుకు దగ్గరకు వెళ్ళిన విజయమ్మ విడుదల చేసిన వీడియో కూడా వైసీపీ విజయం మీద తీవ్ర ప్రభావం చూపించింది. తన కుమార్తె షర్మిలను దీవించాలని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. అది వైసీపీకి యాంటీగానే వర్క్ చేసింది. దాంతో కూడా వైసీపీ ఇబ్బందులో పడింది.

ఆమె కుమార్తె సైడ్ :

ఇదిలా ఉంటే అటు కుమార్తె ఇటు కుమారుడు రాజకీయంగా విభేదించుకున్న నేపధ్యంలో విజయమ్మ అయితే నలిగిపోయారు అని చెప్పాలి. ఆ సమయంలో ఆమె కుమార్తె సైడ్ తీసుకున్నారు అని అంటారు. దానికి కారణం జగన్ రాజకీయంగా బలంగా ఉన్నారని కుమార్తెకు కూడా అవకాశం రావాలని ఆమె కోరుకుని అలా డెసిషన్ తీసుకున్నారు అని అంటారు. అయితే వైఎస్ షర్మిల అయిదారేళ్ళ రాజకీయ గ్రాఫ్ చూసిన తరువాత విజయమ్మ ఒక నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. ఆమె రాజకీయంగా ఆశించిన తీరులో ఎదగలేక పోయారు అన్న భావన కూడా వైఎస్సార్ సన్నిహితులు బంధువులలో ఉందని అంటున్నారు.

జగన్ ని సీఎం గా చూడాలని :

ఈ క్రమంలో వైఎస్సార్ రాజకీయ వారసత్వం విషయంలో ఇద్దరి మధ్యన పోరు సాగితే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న వైఎస్సార్ సన్నిహితులు బంధువులు కూడా విజయమ్మ కీలక నిర్ణయం తీసుకోవాలని సూచించారు అని అంటున్నారు. అదే విధంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉంటే తరువాత పరిష్కరించుకోవచ్చు కానీ వైఎస్సార్ వారసత్వం గట్టిగా నిలబడాలని వారు కోరుకుంటున్నారు అని అంటున్నారు. అంతే కాదు జగన్ ను మరోసారి సీఎం గా చూడాలని విజయమ్మ తన సన్నిహితులతో అంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయమ్మ వైసీపీ తరఫున ప్రచారం చేస్తారని అయితే వినిపిస్తున్న ప్రచారం మరి ఇందులో నిజమెంత ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.