Begin typing your search above and press return to search.

షర్మిల ప్లేస్ లో కొత్త చీఫ్- హైకమాండ్ షాకింగ్ డెసిషన్ ?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ మారబోతున్నారా. ప్రస్తుతం ఈ చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు.

By:  Satya P   |   6 March 2026 8:57 AM IST
షర్మిల ప్లేస్ లో కొత్త చీఫ్- హైకమాండ్ షాకింగ్ డెసిషన్ ?
X

ఏపీ కాంగ్రెస్ చీఫ్ మారబోతున్నారా. ప్రస్తుతం ఈ చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ చీఫ్ లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మీద వాకబు చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ మీద ఢిల్లీ పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. దీంతో కొత్త ప్రచారం మొదలైంది.

డీసీసీలు ఏమి చెప్పాయి :

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు అని అంటున్నారు వారి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద ఆరా తీశారని అంటున్నారు. వారు పీసీసీ పని తీరు మీద తమైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారని ప్రచారం సాగుతోంది. దాంతోనే కాంగ్రెస్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది అంటున్నారు.

సీనియర్లు దూరం :

ఇక ఏపీలో షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక వైసీపీనే టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల మీద విమర్శలు పెద్ద ఎత్తున చేయడంతో పాటు పోరాటాలు చేయాల్సి ఉండగా ఆ దిశగా తగిన కార్యాచరణ లేదని అంటున్నారు. దాంతో పాటు రెండేళ్ళకు పైగా పార్టీ పదవిలో షర్మిల ఉన్నా కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మాత్రం పుంజుకోలేదని అంటున్నారు. ఇక షర్మిల ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దాంతో వారంతా సైలెంట్ అయి దూరం పాటిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే షర్మిల ప్లేస్ లో కొత్త వారిని తీసుకుని రావాలని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం సీరియస్ గానే ఆలోచిస్తోంది అని అంటున్నారు.

పల్లం రాజుకు చాన్స్ :

గోదావరి జిల్లాలకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చురుకైన నేతగా ఉన్నారు. కేంద్రంలో రక్షణ శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు, రాజకీయ చైతన్యం కలిగిన గోదావరి జిల్లాలకు చెందిన వారు కావడంతో ఆయనను ముందు పెట్టి ఏపీలో కాంగ్రెస్ తన ఉనికిని బలంగా చాటుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఏపీలో రాజకీయ పార్టీల తలరాతను మార్చాలీ అంటే కాపులదే కీలక పాత్ర అని విశ్లేషణలు ఉన్నాయి ప్రస్తుతం కాపులు అయితే కొంత అసంతృప్తి గా ఉన్నారని అంటున్నారు. దాంతో వారిని అక్కున చేర్చుకుంటే మెల్లగా ఏపీలో కాంగ్రెస్ కి పునాది గట్టి పడుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. పల్లం రాజు అయితే సీనియర్ నేతలు అంతా పార్టీలో చురుకుగా పనిచేస్తారు అని భావిస్తున్నారుట.

ఏఐసీసీలోకి షర్మిల :

ఇక వైఎస్సార్ తనయగా షర్మిలకు కేంద్ర స్థాయిలో పార్టీలో కీలక పదవిని ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఏపీ కాంగ్రెస్ లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో. అంతే కాదు పల్లం రాజు పీసీసీ చీఫ్ పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది కూడా చర్చ నడుస్తోంది.