Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అజెండా ఇదేనా షర్మిలా ?

తన చిన్నాన్న వివేకా హత్య కేసులో న్యాయం జరగాలన్నదే తన అజెండా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

By:  Satya P   |   24 March 2026 9:20 AM IST
కాంగ్రెస్ అజెండా ఇదేనా షర్మిలా ?
X

తన చిన్నాన్న వివేకా హత్య కేసులో న్యాయం జరగాలన్నదే తన అజెండా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అఫ్ కోర్స్ సొంత కుటుంబం మనిషి కాబట్టి ఆ విషయంలో ఆరాటం ఉండొచ్చు. కానీ దాని మీద సీబీఐ విచారణ సాగుతోంది. వివేకా సొంత కుమార్తె న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆమెకు సంఘీభావంగా ఒక సోదరిగా షర్మిల ఉంటే ఉండొచ్చు కానీ అదే తన అజెండా అని ఒక పీసీసీ చీఫ్ గా ఎలా చెబుతారు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఆస్తులు మ్యాటర్ కాదు :

ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చి మరోసారి జగన్ మీద నిప్పులు చెరిగారు. ఎపుడు వివేకా హత్య కేసు ప్రస్తావన వచ్చినా దానిని పక్కకు పెట్టేలా ఆస్తుల ఇష్యూని వైసీపీ నేతలు ముందుకు తెస్తున్నారు అని మండిపడ్డారు. ఆస్తులు తనకు ప్రదానం కాదని ఆమె కొట్టిపారేశారు. వాటిని అనుభవించాలనుకుంటే ఎపుడో కోర్టు మెట్లు ఎక్కేదానిని అన్నారు. తన అజెండా చిన్నాన్న వివేకా హత్య కేసు తేలాలన్నదే అని ఆమె స్పష్టం చేశారు.

జగన్ మీద ఫైర్ :

తాను ఎవరో ఒకరి ఆస్తులు అనుభవించాలని చూస్తున్నాను అన్నట్లుగా వైసీపీలో సోషల్ మీడియాతో తన మీద నిందలు వేయిస్తున్నారు అని ఆమె ఫైర్ అయ్యారు నిజానికి మరొకరి ఆస్తులను అనుభవిస్తోంది వైఎస్ జగన్ అని ఆమె ఆరోపించారు. జగన్ కి అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు అని ఆమె అన్నారు. తన తల్లి చేత ఒత్తిడి తెచ్చి లేఖలు విడుదల చేయించాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. అయినా తాను చెబితే ఆమె లేఖ రాస్తారా ఆమెకు సొంత స్వేచ్చ ఉండదా అని ప్రశ్నించారు. సోషల్ మీడియా సైన్యం వెనక జగన్ దాక్కున్నారు అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అజెండా ఏంటో :

ఇక షర్మిలకు వివేకా హత్య కేసు ప్రధాన అజెండా అయితే కాంగ్రెస్ అజెండా ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ కి ఏపీలో ఎన్డీయే ప్రధాన ప్రత్యర్ధి. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అలాగే కేంద్రంలో టీడీపీ జనసేన ఉన్నాయి. మరి ధాటీగా ఎన్ డీయే మీద జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సహా అంతా ఉద్యమిస్తున్నారు. కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. వ్యక్తిగ అజెండాలను తెచ్చి అవే మెయిన్ ప్రయారిటీ అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటని అంటున్నారు.

అపుడే ఫలితం :

షర్మిల ఒక లాజిక్ మిస్ అవుతున్నారని అంటున్నారు. వైసీపీ ఏపీ ప్రభుత్వం మీద పోరాటం చేసే దాని కంటే కాంగ్రెస్ ఎక్కువగా చేస్తే ఆటోమేటిక్ గా జనాలు ఆ పార్టీ వైపు చూస్తారు అని అంటున్నారు. అలా వైసీపీని తగ్గించి కాంగ్రెస్ బలపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే షర్మిల మాత్రం జగన్ మీద విమర్శలు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ ని బలోపేతం చేయడం లేదని అంటున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చినపుడు అయితే కూటమి మీద తీవ్ర విమర్శలు కంటే జగన్ మీద హాట్ కామెంట్స్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.