షర్మిలకు మరో షాక్ నిజమేనా ?
రాజ్యసభ సభ్యత్వం విషయంలో పీసీసీ చీఫ్ షర్మిల పేరు అగ్ర భాగాన ఉందని గట్టిగా ప్రచారం సాగింది.
By: Satya P | 6 Jun 2026 6:00 AM ISTరాజ్యసభ సభ్యత్వం విషయంలో పీసీసీ చీఫ్ షర్మిల పేరు అగ్ర భాగాన ఉందని గట్టిగా ప్రచారం సాగింది. దాంతో చాలా మంది అయితే ఆమెకు ముందస్తు అభినందనలు కూడా చెప్పారు. షర్మిల ఇక ఎంపీ అని కూడా అనేసుకున్నారు. రాజ్యసభ సభ్యవం అంటే మాటలు కాదు, ఆరేళ్ల పాటు పెద్దల సభలో ఉంటూ అత్యున్నత విధాయక సభలో మాట్లాడడం అంటే గౌరవం కూడా. ఎంతో మందికి అది కోరుకునే చోటు. కానీ షర్మిలకు దక్కుతోంది అంటే అవునా నిజమేనా అని అనుకున్న వారూ ఉన్నారు. అయితే షర్మిలకు ఆ సీటు తృటిలో తప్పిపోయిందని అంటున్నా కాదని ఇవ్వాల్సిన వారి లిస్ట్ కాంగ్రెస్ పెద్దలు ఏనాడో నిర్ణయించేశారు అని అంటున్నారు.
హామీ ఏమైనట్లు :
మరి షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినపుడు ఇచ్చిన రాజ్యసభ సీటు హామీ ఏమైనట్లు అన్నది కూడా ప్రశ్నగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏ మాత్రం ఎత్తిగిల్ల లేదు కదా అని అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో వైఎస్సార్ వారసత్వం అన్న కోణంలో షర్మిలకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారని చెబుతారు. అయితే వైఎస్ జగన్ నే వైఎస్సార్ కి సిసలైన వారసుడిగా జనాలు భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో కాంగెస్ లో కొత్తగా ఎవరూ చేరిన దాఖలాలు లేవని కూడా అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో షర్మిల కాంగ్రెస్ పెద్దలు ఆశించినట్లుగా ఏపీలో హస్తం పార్టీని జోరు చేయలేకపోయారు అని భావించే ఆమెకు ఇచ్చిన రాజ్యసభ హామీని కూడా అలా వదిలేశారు అని ప్రచారం సాగుతోంది.
పీసీసీ చీఫ్ గా కూడా :
అంతే కాదు ఏపీలో కొత్త మార్పులకు సైతం కాంగ్రెస్ అధినాయకత్వం శ్రీకారం చుట్టబోతోంది అని అంటున్నారు. షర్మిల ప్లేస్ లో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర కు చెందిన బీసీ నేత, కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా వాసి అయిన డాక్టర్ కిల్లి కృపారాణికి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగిస్తారు అని ప్రచారం సాగుతోంది. షర్మిలను కేంద్ర పార్టీలోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఇక కిల్లి కృపారాణి అయితే పార్టీని మరింతగా అభివృద్ధి చేస్తారు అని పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.
బీసీల కోసం :
ఇప్పటిదాకా పీసీసీ చీఫ్ పదవిని రాయలసీమకు గోదావరి జిల్లాలకు ఇచ్చిన కాంగ్రెస్ చాలా ఏళ్ల తరువాత ఉత్తరాంధ్ర కు ఇవ్వబోతోంది అని అంటున్నారు. బీసీల ఖిల్లా అయిన ఉత్తరాంధ్రాలో పార్టీ ఎంతో కొంత ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని భావించే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు అని అంటున్నారు ఇక అందరినీ కలుపుకుని పోతూ కూటమి ప్రభుత్వం మీద నేరుగా విమర్శలు చేసే పీసీసీ చీఫ్ గా కిల్లి కృపారాణి ఉంటారని కూడా భావించే ఆమెకి ఈ అవకాశం ఇస్తారని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే షర్మిలకు డబుల్ షాక్ గానే భావించాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.
