Begin typing your search above and press return to search.

షర్మిలకు రాజ్యసభ సీటు గ్యారంటీ ?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైసీపీ అధినేత జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిలకు గుడ్ న్యూస్ ని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పబోతోంది అని అంటున్నారు.

By:  Satya P   |   29 May 2026 9:35 AM IST
షర్మిలకు రాజ్యసభ సీటు గ్యారంటీ ?
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైసీపీ అధినేత జగన్ సోదరి అయిన వైఎస్ షర్మిలకు గుడ్ న్యూస్ ని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పబోతోంది అని అంటున్నారు. ఆమెకు పెద్దల సభలో అవకాశం దక్కబోతోంది అని కాంగ్రెస్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ట్రబుల్ షూటర్ గా పేరు గడించిన డీకే శివ కుమార్ కర్ణాటకకు కొత్త చీఫ్ మినిస్టర్ కాబోతున్నారు. ఆయనే గతంలో షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకుని రావడంలో ఆమె పార్టీని విలీనం చేయించడంలో కీలకమైన పాత్ర పోషించారు. వైఎస్సార్ కుటుంబం తో డీకేకు ఉన్న పరిచయాలతో ఈ విధంగా ఆయన ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి తన వంతుగా స్టెప్ తీసుకున్నారు అని అంటున్నారు.

నాటి హామీతోనే :

ఆ సమయంలో షర్మిలకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నేరుగా ఒక హామీ ఇచ్చింది అని చెబుతున్నారు. ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని ఆ హామీ సారాంశం. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరారు అని అంటున్నారు. ఇక 2024 లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఆనాడు కూడా షర్మిల పేరు వినిపించింది కానీ ఆమెకు చాన్స్ దక్కలేదు. ఇక ఈసారి కూడా కర్ణాటక నుంచి మూడు ఎంపీ సీట్లు రాజ్యసభకు ఖాళీ అవుతున్నాయి. ఇందులో ఒక దానికి షర్మిలకు ఇస్తారు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా దక్షిణాదిన పార్టీ వ్యవహారాలు చూసే డీకే ముఖ్యమంత్రి కావడం షర్మిలకు కలిసి వచ్చే అంశం అని అంటున్నారు. అందుకే నాటి హామీ నేడు నెరవేరబోతోంది అని అంటున్నారు.

వైసీపీని వీక్ చేయడమే :

షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి దక్కదని ఆమె పట్ల అధినాయకత్వం అంత సుముఖంగా లేరని వస్తున్న వార్తలు అన్నీ ఉత్తవే అని అంటున్నారు. షర్మిల వైసీపీని జగన్ ని టార్గెట్ చేసుకుని విమర్శించడం వెనక కాంగ్రెస్ పెద్దల వ్యూహం కూడా ఉందని చెబుతున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలని రాజకీయ నీతి. అందుకే వైసీపీని విమర్శిస్తేనే అక్కడకు చేరిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత వెనక్కి వస్తుందని ఆశతోనే కాంగ్రెస్ పెద్దలు షర్మిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. ఇపుడు రాజ్యసభ సీటు ఇచ్చి ఆమెని మరింతగా బలోపేతం చేయడం ద్వారా వైసీపీని ఇంకా వీక్ చేయడానికి చూస్తారు అని అంటున్నారు.

ఏపీ మీదనే ఫోకస్ :

ఈ రోజున దక్షిణాది అంతా కాంగ్రెస్ ఉందని ఏపీలో మాత్రం పెద్దగా లేదని కాంగ్రెస్ ఢిల్లీ నేతలు భావిస్తున్నారు దాంతో రానున్న రోజులలో ఏపీ మీద ఫోకస్ పెంచుతారు అని అంటున్నారు. ఇక రాజ్యసభ మెంబర్ గా షర్మిలను చేయడం ద్వారా ఆమె వాయిస్ మరింతగా పెంచి ఒక చట్ట సభ సభ్యురాలిగా ఆమె ఇమేజ్ ని కూడా పెంచడం ద్వారా ఏపీలో కాంగ్రెస్ గొంతుని ఇంకా పెద్దదిగా చేయాలన్న వ్యూహ రచన ఉంది అని అంటున్నారు. రానున్న రోజులన కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీలో పర్యటిస్తారు అని అంటున్నారు. ఇక డీకేకి కూడా ఈ బాధ్యతలు అప్పగిస్తారు అని చెబుతున్నారు. మొత్తం మీద షర్మిలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాజ్యసభ సీటు దక్కే చాన్స్ ఉందని తొందరలోనే ఆమె శుభ వార్తను వింటారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత వరకు ఉందో.