15 ఏళ్ల తర్వాత.. పార్లమెంటులో 'వైఎస్' గళం.. !
సో.. ఇదే జరిగితే.. ఆమె పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయమని అంటు న్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కోరు కున్నట్టు ప్రచారం జరిగింది.
By: Garuda Media | 30 May 2026 8:26 PM ISTప్రస్తుతం ఏపీ సహా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు.. రాజ్యసభ సీటు ఇస్తున్నారని!. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. సీటు ఖాయమ ని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం రానుంది. ఈ క్రమంలో హుటాహుటిన ఆమె ఢిల్లీకి వెళ్లడం.. కాంగ్రెస్ పెద్దలు.. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కావడం వంటివి ఆమెకు పెద్దల సభ సీటు ను ఖరారు చేస్తున్నారన్న చర్చకు బలాన్ని చేకూర్చినట్టు అయింది.
ప్రస్తుతం కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి షర్మిలకు ఇచ్చే అవ కాశం ఉందని తెలుస్తోంది. సో.. ఇదే జరిగితే.. ఆమె పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయమని అంటు న్నారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని ఆమె కోరు కున్నట్టు ప్రచారం జరిగింది. అయితే.. జగన్ ఈ ప్రతిపాదనకు తిరస్కరించిన కారణంగానే.. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారన్న విమర్శలు వచ్చాయి. 2024 జనవరిలో తాను పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్‌లో కలిపేసి.. తాను ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు.
ఇక, గత రెండేళ్లుగా పార్టీ తరఫున వాయిస్ వినిస్తున్నారు. ఉభయ కుశలోపరి.. అన్నట్టుగా కాంగ్రెస్ వ్యతిరేకించే జగన్‌ను.. తనకు అన్యాయం చేశాడన్న ఆవేదనతో అన్నను కలగలిపి.. ఆమె రాజకీయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా పనిచేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు రాజ్యసభలో షర్మిల అడుగు పెడితే.. వైఎస్ కుటుంబం నుంచి దాదాపు 15 సంవత్సరాల తర్వాత.. పార్లమెంటులో గళం వినిపించే నాయకురాలు షర్మిలే అవుతారు.
2009 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత.. జగన్ కడప ఎంపీగా గెలిచారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో ఆయన కాంగ్రెస్‌తో విభేధించి సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత.. పులివెందుల నుంచి పోటీ చేసి విజయం దక్కించుకు న్నారు. ఇక, అప్పటి నుంచి నేరుగా వైఎస్ కుటుంబం తరఫున పార్లమెంటులో గళం వినిపించే నాయకు లు లేకుండా పోయారు. అవినాష్ రెడ్డిఉన్నప్పటికీ.. వైఎస్ రాజశేఖరరెడ్డికి దూరపు బంధువే అవుతాడు. కాగా.. షర్మిలకు పెద్దల సభలో అడుగు పెట్టే ఛాన్స్ వస్తే.. 15 ఏళ్ల తర్వాత.. వైఎస్ ఫ్యామిలీ నుంచి పార్లమెంటుకు వెళ్లే ఏకైక నాయకురాలిగా షర్మిల కనిపిస్తారు.
