మోడీ వస్తున్నప్పుడే.. అమరావతిపై రిసెర్చా: షర్మిలపై నెటిజన్ల కామెంట్స్
కానీ.. మోడీ రాజధానికి వచ్చి పనులకు శ్రీకారం చుడుతున్న సమయంలోనే షర్మిల అమరావతిపై రిసెర్చ్ చేయాలా?
By: Tupaki Desk | 30 April 2025 9:49 PM ISTకాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడ పోలీసులు గృహనిర్బంధం చేశారు. అయి తే.. ఈ సందర్భంగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగడం.. వారు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అనం తరం.. తనకు అందుబాటులో ఉన్న మీడియాతో షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమరావతిపై రిసెర్చ్ చేయాలని అనుకున్నానని.. అందుకే.. బుధవారం ముహూర్తం పెట్టుకున్నానని చెప్పారు. వాస్తవా నికి ఇన్నాళ్లు ఆమె ఏం చేశారో.. ఎందుకు ఇన్నాళ్లు రిసెర్చ్ చేశారో ఎవరికీ తెలియదు.
కానీ.. మోడీ రాజధానికి వచ్చి పనులకు శ్రీకారం చుడుతున్న సమయంలోనే షర్మిల అమరావతిపై రిసెర్చ్ చేయాలా? అంటూ.. నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక పార్టీ అధ్యక్షురాలి మీద పోలీసులు జులుం ప్రదర్శించారని చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతున్నారు. చట్ట ప్రకారం వ్యవహరించకపోతే.. ఎలాంటి వారైనా చట్టానికి బద్ధులుగా వ్యవహరించాలని.. పోలీసులు చెప్పింది వినాలని గుర్తు చేస్తున్నారు. రాజధానిని ఎలా ఉందో చూస్తానన్న ఆమె వ్యాఖ్యలను కూడా.. ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అయిందని.. ఇప్పటి వరకు రాజధానిలో ఎందుకు పర్యటిం చలేదని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆగిపోయిన అమరావతిని పట్టాలెక్కిస్తుంటే.. ప్రధాని వస్తున్న వేళ ఇలా యాగీ చేయడం ఏంటన్నది మెజారిటీ నెటిజన్ల ప్రశ్న. రాజధానికి మోడీ అన్యాయం చేశారన్న వ్యాఖ్యలపైనా నిలదీశారు. ఆనాడు రాష్ట్ర విభజన సమయంలోనే.. రాజధానిని నిర్ణయించి ఉన్నా.. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత.. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉన్నా.. వైసీపీ మూడు రాజధానులు తెచ్చినప్పుడు.. వ్యతిరేకించి ఉన్నా.. షర్మిల ఇప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
