Begin typing your search above and press return to search.

జగన్ కి షర్మిల సవాల్...లాజిక్ తోనే !

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సరికొత్తగా సవాల్ చేశారు లాజిక్ పాయింట్ తోనే ఆమె ఈ చాలెంజ్ చేశారు అని చెప్పాలి.

By:  Satya P   |   17 March 2026 10:39 PM IST
జగన్ కి షర్మిల సవాల్...లాజిక్ తోనే !
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సరికొత్తగా సవాల్ చేశారు లాజిక్ పాయింట్ తోనే ఆమె ఈ చాలెంజ్ చేశారు అని చెప్పాలి. ఈ సవాల్ స్వీకరించి జగన్ అన్నా అని ఆమె డైరెక్ట్ గానే డిమాండ్ చేశారు. నిజానికి ఇది వైసీపీకి ఇరకాటంగా ఉండేలాగానే కనిపిస్తోంది. చెల్లెమ్మ అదను చూసి మరీ ఇచ్చిన ఈ సవాల్ షాక్ కి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ అయితే సాగుతోంది.

ఈసీకి వ్యతిరేకంగా :

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ మీద ఇండియా కూటమి ఎంపీలు అంతా కలసి అభిశంసన తీర్మానం ఇచ్చారు. దాని మీద ఏకంగా 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. వీరంతా విపక్షంలోని ఎంపీలు. కేంద్ర ఎన్నికల సమంఘం ప్రధానాధికారిగా జ్ఞానేశ్వర్ పని తీరు మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ అభిశంసన తీర్మానం ఇచ్చారు. ఇపుడు షర్మిల జగన్ కి కోరేది ఏంటి అంటే ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ మీద విపక్షాలు మొత్తం కలిసి పెడుతున్న అభిశంసన తీర్మానానికి వైసీపీ తరఫున మద్దతు ఇవ్వాలని. వైసీపీ పెద్దలు సత్తా ఉంటే ముందు ఆ పని చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

దొంగ ఏడుపులు అంటూ :

రాష్ట్రంలో ఈవీఎంల వల్లనే తాము ఓటమి చెందామని ఎన్నికలో ఓటమి తరువాత వైసీపీ నేతలు దొంగ ఏడుపులు ఏడ్చారు కదా అని షర్మిల ఎద్దేవా చేశారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎక్కడికి పోయాయో అని కూడా కన్నీరు పెట్టారు కదా అని ఆమె జగన్ మీద సెటైర్లు పేల్చారు. మరి ఇపుడు ఏకంగా ఈసీ మీదనే అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నపుడు వైసీపీకి మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుందని ఆమె ప్రశ్నించారు.

చిత్తశుద్ధి ఉంటే :

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది కాదని ఈవీఎంలతో ఏర్పడింది అని వైసీపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు కదా ఇపుడు ఈసీ మీద అభిశంసన తెలియచేసే అవకాశాన్ని ఎందుకు వాడుకోరని ఆమె నిలదీశారు. నిజంగా వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే ఇండియా కూటమి తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. తాను మోడీకి దత్తపుత్రుడు కాను అని నిరూపించుకునేందుకు అయినా జగన్ ఈసీకి వ్యతిరేకంగా విపక్షాలు ఇచ్చిన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆమె సలహా ఇచ్చారు.

కేంద్ర ఎన్నికల సంఘం విపక్షాలను ఇబ్బందులు పెడుతూ రాజ్యంగానికి విరుద్ధమైన తీరులో వ్యవహరిస్తోంది అని షర్మిల మండిపడ్డారు. మొత్తానికి షర్మిల చేసిన ఈ డిమాండ్ మీద వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇది ఎపుడూ వైసీపీని జగన్ ని విమర్శించినట్లుగా షర్మిల చేయలేదు, ఒక ఇష్యూని ముందు పెట్టి వైసీపీని ఇరకాటంలో పెట్టారు. దాంతో అంతా వైసీపీ ఏమి చేయబోతోంది అని ఎదురుచూస్తున్నారు.