Begin typing your search above and press return to search.

మ్యాజిక్ ఫిగర్ త్రిబుల్ డిజిట్...వైసీపీకి టఫ్ టాస్క్ !

ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఉమ్మడి క్రిష్ణా జిల్లా దాకా మొత్తం 101 సీట్లు ఉన్నాయి. సీట్లు కొత్తగా పెరిగితే ఇవి కాస్తా 150 ప్లస్ అవుతాయి.

By:  Satya P   |   26 March 2026 1:00 AM IST
మ్యాజిక్ ఫిగర్ త్రిబుల్ డిజిట్...వైసీపీకి టఫ్ టాస్క్ !
X

పెరుగుతున్న సీట్ల వల్ల అవకాశాలు ఎన్ని ఉంటాయో రాజకీయంగా సవాళ్ళు అంతకు మించి ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ఈ టఫ్ టాస్క్ గా ఉండబోతోంది. దేశమంతా ఒకే విధంగా ఉన్న సీట్లకు మరో యాభై సీట్లను కలుపుతూ కొత్తగా సీట్ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన ఏపీలో చూస్తే 175 ప్లస్ 88 కలుపుకుని 263గా అసెంబ్లీ సీట్లు ఉండబోతున్నాయి. మరి ఏపీలో అధికారం చేపట్టాలంటే గతంలో మాదిరిగా డబుల్ డిజిట్ 88 మ్యాజిక్ ఫిగర్ అయితే కానే కాదు, ఈసారి ఆ నంబర్ త్రిబుల్ డిజిట్ కి చేరుకుంది. అదే 132 అన్న మాట.

సింగిల్ గా ఫైట్ :

ఇక ఏపీలో చూస్తే వైసీపీ విపక్షంలో ఉంది. ఏ పార్టీతోనూ జట్టు కట్టే సీన్ అయితే లేదు, వామపక్షాలతో వైసీపీ మైత్రి చేస్తుంది అని వార్తలే తప్ప ఆ దిశగా ఎలాంటి సంకేతాలు అయితే లేవు. పైగా సీపీఐ అయితే మొదటి నుంచి వైసీపీకి దూరంగానే ఉంటోంది. ఇక సీపీఎం అయితే కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా వైసీపీ వైపు నుంచి పాజిటివ్ రియాక్షన్స్ రావడం లేదు, కాంగ్రెస్ తో అయితే వైసీపీకి శాశ్వత వైరమే. అది సిద్ధాంతబద్ధమైనది అనడం కంటే వ్యక్తిగతంగానే అని చెప్పాల్సి ఉంటుంది. జగన్ ని అక్రమంగా అరెస్ట్ చేయించి జైలులో వేసింది కాంగ్రెస్ అన్న ఆగ్రహం ఆ పార్టీలో ఉంది. దాంతో ఏపీలో విపక్షంలో ఒక కూటమి ఏర్పాటు కావడం అయితే బహు కష్టం. సో వైసీపీ ఆలోచనలు కూడా సింగిల్ గా పోటీకి దిగడమే అన్నది ఉంది.

గ్రౌండ్ లెవెల్ లో సీన్ :

ఇక ఏపీలో చూస్తే మూడు రీజియన్లలో గ్రౌండ్ లెవెల్ లో సీన్ చూస్తే వైసీపీకి గ్రాఫ్ అయితే పెద్దగా పెరిగింది ఇప్పటికి అయితే లేదని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో కూడా బాగా పుంజుకోవాల్సి ఉంది అని అంటున్నారు. అక్కడ ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీకి ఇంకా గ్యాప్ పాటిస్తోంది అని అంటున్నారు. ఆ వర్గం ఉదాశీనతతో పాటు ధర్మాగ్రహం వల్లనే 2024 ఎన్నికల్లో వైసీపీ భారీ ఓటమిని అందుకుంది అని విశ్లేషణలు ఉన్నాయి. అదే విధంగా రాయలసీమలో టీడీపీ గతం కంటే బలపడుతోంది, డెవలప్మెంట్ కాన్సెప్ట్ తో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. అలాగే సామాజిక సమీకరణలను కూడా బేరీజు వేసుకుంటూ వైసీపీని దెబ్బ తీసేందుకు వ్యూహ రచన చేస్తోంది. బీజేపీ ఫోకస్ కూడా రాయలసీమ మీద ఉందని అంటున్నారు. జనసేన కూడా ఒక ప్రధాన సామాజిక వర్గం దన్నుతో ఎదగాలని చూస్తోంది. దీంతో వైసీపీకి 2014, 2019 నాటి ఫలితాలు అయితే మళ్ళీ వస్తాయా అన్న చర్చ ఉండనే ఉంది.

యధాతధ పరిస్థితి :

ఇక కోస్తా ఉభయ గోదావరి రీజియన్ లో చూసుకుంటే వైసీపీకి యధాతధ పరిస్థితి ఉందని అంటున్నారు. దక్షిణ కోస్తాలో ప్రకాశం, నెల్లూరులలో వైసీపీ ఇపుడిపుడే కోలుకుంటోంది అన్న ఆశలు ఉన్నప్పటికీ క్రిష్ణా గుంటూరులలో టీడీపీ అత్యంత బలంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం గణనీయంగా ఉంది. వీటిని తట్టుకుని వైసీపీ బలం పుంజుకోవాలంటే గడచిన 21 నెలలలో తగిన విధంగా కార్యాచరణ అయితే చేసింది పెద్దగా లేదని అంటున్నారు. దాంతో ప్రస్తుతానికి అయితే గ్రాఫ్ అయితే పెరగలేదని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్ర రీజియన్ లో కూడా కూటమి స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ సామాజిక రాజకీయ కోణంలో నుంచి చూస్తే కూటమిలోని మూడుపార్టీలకు అనుకూలంగానే ఈ రోజుకీ ఉంది అని అంటున్నారు. వ్యతిరేకత వస్తుందని వైసీపీ పెట్టుకున్న ఆశలు అయితే అంతగా ఫలించడం లేదని అంటున్నారు.

మ్యాజిక్ అంతా అక్కడే :

ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఉమ్మడి క్రిష్ణా జిల్లా దాకా మొత్తం 101 సీట్లు ఉన్నాయి. సీట్లు కొత్తగా పెరిగితే ఇవి కాస్తా 150 ప్లస్ అవుతాయి. మరి ఇందులోనే మెజారిటీ సీట్లు ఏ పార్టీ కానీ కూటమి కానీ సాధిస్తుందో అదే అధికారం చేపడుతుందని అంటున్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాలలో 74 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. సీట్లు ఇక్కడ కొత్తగా పెరిగితే 111 నంబర్ అవుంది. ఈ గ్రేటర్ రాయలసీమలో ఒకవేళ వైసీపీకి పరిస్థితులు అనుకూలించి మెజారిటీ సీట్లు సాధించినా మ్యాజిక్ ఫిగర్ అయిన 132 నెంబర్ ని చేరుకోవడానికి కోస్తా జిల్లాల అవసరం భారీగానే ఉంటుంది. ఈ సీట్లన్నీ ఒంటి చేత్తో వైసీపీ గెలుచుకోవాల్సి ఉంటుంది. అవతల వైపు మూడు పార్టీలను ఎదిరించి నిలబడాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన రాజకీయ పోరాటంగా చెబుతున్నారు. ఇప్పటి నుంచే వైసీపీ అధినాయకత్వం జనంలో ఉండే నాయకత్వాన్ని గుర్తించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ కనెక్ట్ కాకపోతే మాత్రం ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అదే కూటమికి అయితే 132 మ్యాజిక్ ఫిగర్ ని మూడు పార్టీల బలంతో చేరుకోవడం వైసీపీ కంటే సులభం అవుతుంది అన్నది రాజకీయ లెక్కలు చెబుతున్న విశ్లేషణగా ఉంది.