జగన్ తో ఈసారి ఆషామాషీ కాదట...నేతల టెన్షన్ ?
వైసీపీకి సర్వ సత్తాక నాయకుడు వైఎస్ జగన్. ఇది అందరికీ తెలిసిందే. తెలుగు రాజకీయాల్లో తమతోనే పార్టీ అన్న వారు ఇద్దరే ఉన్నారు.
By: Satya P | 14 April 2026 8:15 AM ISTవైసీపీకి సర్వ సత్తాక నాయకుడు వైఎస్ జగన్. ఇది అందరికీ తెలిసిందే. తెలుగు రాజకీయాల్లో తమతోనే పార్టీ అన్న వారు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు ఎన్టీఆర్ రెండవ వారు జగన్. ఎన్టీఆర్ అయితే తన సొంత వారికి కీలక పదవులు ఇచ్చి పార్టీని అభివృద్ధి చేశారు. అలా సెకండ్ గ్రేడ్ లీడర్ షిప్ టీడీపీలో డెవలప్ అయింది. చంద్రబాబు అలా పార్టీ మీద సాధించిన పట్టు ఎన్టీఆర్ తరువాత కూడా పార్టీ కొనసాగేందుకు ఆస్కారం ఏర్పడేలా చేసింది. అదే జగన్ విషయం తీసుకుంటే వన్ అండ్ ఓన్లీగా పార్టీలో ఉంటున్నారు. నాయకుల నుంచి అభిప్రాయాలను జగన్ తీసుకుంటారు, ఆయన కోటరీ మాట వింటారు అని ప్రచారంలో ఉన్నప్పటికి లాస్ట్ డెసిషన్ జగన్ దే అన్నది వైసీపీలో ఇన్ సైడ్ టాక్.
మూడు ఎన్నికల్లో అలా :
అయితే జగన్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లను తన మాటే చెల్లాలి అన్న ధోరణిలో ఇవ్వలేదు. చాలా వరకూ నేతలను గౌరవించడం మొహమాటాలు సీనియర్లు లేదా కావాల్సిన వారు ఇలా అనేక లెక్కలు వేసుకుని ఇచ్చారు. 2014లో అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన అత్యధికులకు టికెట్లు ఇచ్చారు. వారంతా తన వెంట నడిచారు అని కృతజ్ఞతతో ఇచ్చారు. ఇక 2019లో చూస్తే పార్టీ కోసం పదేళ్ళుగా కష్టపడ్డారని టికెట్లు ఎక్కువ మందికి ఇచ్చారు. ఇదిలో విజయావకాశాలు అన్నది సెకండరీ అయింది అన్న మాట ఉంది. అయినా సరే వైసీపీ ఊపులో వారంతా గెలిచి వచ్చారు. 2024 కి వచ్చేసరికి తన చరిష్మా మీద అతి విశ్వాసంతో టికెట్లు ఇచ్చారు. ఆ విధంగా చూస్తే కనుక చాలా వైసీపీకి ఇవి చేదు ఫలితాలుగా మిగిలాయి. దాంతో ఈసారి జగన్ అన్నీ ఆలోచించుకుని ఆచీ తూచీ అడుగులు వేస్తారు అని అంటున్నారు.
చావో రేవో అన్నట్లుగా :
అయితే 2029 లో జరిగే ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెదితే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం లో పడుతుంది. అందుకే వైసీపీ ఈసారికి ఒక్కటే ఆప్షన్ ఉంది. అదే గెలుపు. దాని కోసం ఇప్పటి నుంచే ఆ పార్టీ అన్ని అస్త్రాలను సమకూర్చుకుంటోంది. ఇక బ్రహ్మాస్త్రంగా జగన్ పాదయాత్ర ఎటూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీలో ఒక చర్చ సాగుతోందిట. ఈసారి టికెట్లు పార్టీలో అంత ఆషామాషీగా రావు అని.
గెలుపు గుర్రాలకే :
అన్ని రకాలుగా పరీక్షించి గెలుపు గుర్రాలు అని పూర్తిగా నమ్మిత తరువాతనే వైసీపీ అధినేత టికెట్లు ఇస్తారు అని అంటున్నారు. ఏ మాత్రం అసమ్మతి పార్టీలో ఉన్నా ఆ నాయకుల మీద క్యాడర్ వ్యతిరేకత ఉన్నా కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు. అలాగే జనాలలో ఆదరణ వారికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు అని అంటున్నారు తన ఇమేజ్ వల్ల ఎవరైనా గెలుస్తారు అనుకున్నది 2024 లోనే తేలిపోయింది కాబట్టి తమ ఇమేజ్ తో పాటుగా బలమైన అభ్యర్ధి సామాజిక రాజకీయ సమీకరణలు అన్నీ చూసి వడపోత పోసి లెక్కలు చూసి మరీ జగన్ టికెట్లు ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. దీంతో ఈసారి వైసీపీలో అనూహ్యమైన మార్పులే ఉంటాయని చెబుతున్నారు. దాంతో ఇది పార్టీ నేతలలో యమ టెన్షన్ గా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం నిజమవుతుందా అదే జరిగితే చాలా మంది పరిస్థితి ఏంటి అన్నది.
