Begin typing your search above and press return to search.

ఈసారి అసెంబ్లీకి జగన్ రావడం పక్కా ?

ఇదిలా ఉంటే జగన్ మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఆయన అప్పుల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 2:30 AM
ఈసారి అసెంబ్లీకి జగన్ రావడం పక్కా ?
X

అవునా ఇది నిజమేనా అంటే వైసీపీ రాజకీయం చూస్తుంటే జగన్ అసెంబ్లీకి కచ్చితంగా వస్తారని అంటున్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన ముగిసింది. జనంలో వ్యతిరేకత ఉందని వైసీపీ అంటోంది. అందుకే వెన్నుపోటు దినం నిర్వహిస్తే జనాలు తండోపతండాలుగా వచ్చారని వైసీపీ నిరసనలకు సంఘీభావం గొప్పగా ప్రకటించారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జగన్ మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రభుత్వాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారు. ఆయన అప్పుల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలలో ఏవి నేరవేరలేదో కూడా డెమో ఇస్తున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది అని అంటున్నారు.

ఇలా ఆయన ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు అంటున్నారు. మరో వైపు చూస్తే గత ఏడాది కాలంగా చూస్తే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత బాగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు.

దాంతో జగన్ తనకు ఉన్న ఫార్టీ పర్సెంట్ ఓటు షేర్ కి దన్నుగా ప్రజాదరణ కూడా పెరిగింది కాబట్టి ఇక అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడితే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఈసారి ఎపుడు అసెంబ్లీ సెషన్ జరిగినా జగన్ రావాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే రెండు నెలల క్రితమే బడ్జెట్ సెషన్ పూర్తి అయింది. ఎక్కువ రోజుల పాటే బడ్జెట్ సెషన్ సాగింది. మరో వైపు చూస్తే వర్షాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది కానీ దానిని శీతాకాల సమావేశాలను కలిపి ఒకేసారి నిర్వహించవచ్చు అంటున్నారు. ఎలా చూసుకున్నా ఈసారి అసెంబ్లీ సెషన్ నవంబర్ లో కానీ మొదలయ్యే అవకాశాలు అయితే లేవు అని అంటున్నారు.

అంటే ఇప్పటికి మరో నాలుగు నెలల సమయం అన్న మాట. అప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఏణ్ణర్థం అవుతుంది. మరిన్ని సమస్యలు కూడా కొత్తగా చేరుతాయని అంటున్నారు. దాంతో ఈసారి వింటర్ సెషన్ హీటెక్కిస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. అసెంబ్లీకి వెళ్తేనే వైసీపీకి మంచి పొలిటికల్ మైలేజ్ దక్కుతుందని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

సొంత పార్టీలో కూడా ఇదే విషయం మీద డిస్కషన్ సాగుతోంది. అసెంబ్లీకి మరో ఏడాది పాటు అయినా వెళ్ళి చివరి మూడేళ్ళ పాటు జనంలో ఉంటే మంచి రిజల్ట్ వస్తుందని అంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా కూడా అసెంబ్లీకి వెళ్ళడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఈసారి అసెంబ్లీకి హాజరవుతారని అంటున్నారు. అందులో నిజమెంత అన్నది తెలియాలంటే అసెంబ్లీ సెషన్ మొదలు కావాల్సిందే అని అంటున్నారు.