Begin typing your search above and press return to search.

జగన్ ది పెద్ద ప్లానే కదా !

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద ప్లాన్ లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన వ్యూహాలు కార్యాచరణను చూస్తే కనుక ఇలాంటిదేదో ఉందని అనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 4:43 PM IST
జగన్ ది పెద్ద ప్లానే కదా !
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద ప్లాన్ లో ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఆయన వ్యూహాలు కార్యాచరణను చూస్తే కనుక ఇలాంటిదేదో ఉందని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటి అంటే జగన్ ఇపుడు ఏమి మాట్లాడుతున్నాడో కూటమి నేతలకు అసలు అర్ధం కావడం లేదు అంటున్నారు.

సాధారణంగా కూటమి అధికారంలో ఉంటే మరో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్డీలు భయపడతారు కానీ ఈసరి సీన్ రివర్స్ లో ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నపుడు అమరావతి రాజధాని కమ్మ వారి కోసమే అని ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంతే కాదు వైసీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉండేవారు.

వారంతా అప్పటి ప్రతిపక్షం అయిన టీడీపీ మీద హాట్ కామెంట్స్ చేసేవారు. వల్లభనేని వంశీ కొడాలి నాని వంటి వారు రెచ్చిపోతూ ఒక స్థాయి దాటి కూడా మాట్లాడేవారు. వారు చేసే విమర్శలు కూడా సభ్య సమాజంలో చాలా మంది జీర్ణించుకోలేని విధంగా ఇబ్బందిగా ఉండేవని అంటారు.

ఇలా ఆనాడు వారు చేసిన విమర్శల ఫలితంగా హద్దూ అదుపూ లేని నోటి దురుసు వల్ల జైలు పాలు అవుతున్నారు. చాలా మంది నేతలు బొక్క బోర్లా పడ్డారు కూడా అని అంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే రాజకీయ వైరంతో పాటు సామాజిక వైరం కూడా పెద్ద ఎత్తున సాగుతూ వస్తోంది.

ఇది దుష్పరిణామాలకు దారి తీసేలా ఉన్నా కూడా ఎందుకో అది అలా కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యం నుంచి చూసుకున్నపుడు ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి మొత్తం ఏపీలోని కమ్మ వారి జనాభాలో 98 శాతం ఓటు వేశారు అని అంచనాలుగా చెబుతారు. అంటే ఇది చాలా అరుదైన సందర్భం అన్న మాట.

ఒక కులం గంపగుత్తగా ఎపుడూ ఒక పార్టీకి ఓటేయదు. కానీ ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇలా జరుగుతోంది అని సరిపెట్టుకోవాల్సిందే అంటున్నారు. వారు ఎందుకు వేశారు అంటే వైసీపీకి తాము టార్గెట్ అయ్యామన్నది గుర్తించే అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ తానుగా చేసుకున్న తప్పులే ఉన్నాయని కూడా చెబుతారు.

ఇక కమ్మ వారి దెబ్బ ఎలా ఉంటుందో తొలిసారి వైసీపీ 2024 ఎన్నికల్లో చవి చూసింది అని అంటున్నారు. దాంతో ఇన్నాళ్ళు వైసీపీ లోపలన అంతర్మధనం చెందినా కూడా సత్తెనపల్లి రెంటపాళ్ళ పర్యటనలో జగన్ నోటి వెంట వచ్చిన మాటలను చూస్తే కనుక కమ్మ వారి వైపు ఆయన సానుకూలంగా మాట్లాడారు అని అంటున్నారు.

నిజానికి చూస్తే పల్నాడు ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా వారే ముందుండి అన్నీ నడుపుతారు. అలాంటి మరో బలమైన సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతానికి జగన్ వెళ్ళి అక్కడ కమ్మల గురించి జగన్ మాట్లాడడమే రాజకీయ విశేషంగా చూస్తున్నారు.

ఇది ఒక విధంగా చెప్పాలీ అంటే పక్కా రాజకీయ వ్యూహంగానే అంతా అంటున్నారు. తమ పార్టీకి చెందిన కమ్మ వారిని ఎందుకు వేధిస్తున్నారు అని జగన్ సూటిగానే చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ విధంగా ఆయన కమ్మ సామాజిక వర్గం వైపు సాఫ్ట్ కార్నర్ తీసుకున్నట్లుగా తన వైఖరిని తేటతెల్లం చేశారు అని అంటున్నారు. ఇలా సడెన్ గా జగన్ నోటి నుంచి ఒక బలమైన సామాజిక వర్గానికి అనుకూలంగా మద్దతుగా వ్యాఖ్యలు రావడం మీద చర్చ సాగుతోంది.

అసలు జగన్ ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందో ఆయన వ్యాఖ్యల వెనక అర్ధమేంటి అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు అని అంటున్నారు. ఇక చూస్తే కనుక తాను అధికారంలో ఉన్నపుడు కమ్మ వారిని దగ్గరకు రానీయకుండా జగన్ వ్యవహరించారు అని టీడీపీ కూటమి నేతలు అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం మీద కక్ష కట్టినట్లుగా ఆనాడు వైసీపీ ఏలుబడిలో వ్యవహరించారు అని కూడా గుర్తు చేస్తున్నారు.

అలాంటిది ఇపుడు వారి మీద ప్రేమ ఎక్కువ అయినట్లుగా జగన్ తాజా కామెంట్స్ ఉన్నాయని ఎకసెక్కమాడుతున్నారు. అయితే ఏపీ పాలిటిక్స్ లో కమ్మ వారి పవర్ ఏమిటి అన్నది జగన్ కి 2024 ఎన్నికల తరువాత తెలిసి వచ్చిందని అంటున్నారు. ఏపీలో ప్రధానమైన సామాజిక వర్గంలో పెట్టుకుంటే రాజకీయంగా ఎంతటి ఇబ్బందులు వస్తాయో కూడా ఆయనకు బాగా అర్ధం అయిన మీదటనే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.

మరి ముందు ముందు జగన్ తన పార్టీ పరంగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే ప్రాధాన్యతను బట్టి మాత్రమే వైసీపీ స్టాండ్ ఏమిటి చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనక ఎన్నో అర్ధాలు పరమార్ధాలు వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.