Begin typing your search above and press return to search.

జగన్ సెల్ఫ్ గోల్స్...కాంగ్రెస్ సీనియర్ కఠిన విశ్లేషణ

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్స్ వరసగా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తనదైన శైలిలో ఒక కఠిన విశ్లేషణ చేశారు.

By:  Satya P   |   18 April 2026 7:00 AM IST
జగన్ సెల్ఫ్ గోల్స్...కాంగ్రెస్ సీనియర్ కఠిన విశ్లేషణ
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్స్ వరసగా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి తనదైన శైలిలో ఒక కఠిన విశ్లేషణ చేశారు. జగన్ రాజకీయ వైఖరులు ఆయన అనుసరిస్తున్న విధానాల గురించి ఒక యూట్యూబ్ చానల్ లో యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తులసి రెడ్డి జగన్ వర్తమాన పాలిటిక్స్ మీద తన విశ్లేషణను వినిపించారు. మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి పాలు అయ్యాక రెండేళ్ళ విపక్ష పాత్రలో సెల్ఫ్ గోల్స్ ఎక్కువ అయ్యాయని కూడా విమర్శించారు.

తప్పుల మీద తప్పులు :

జగన్ రాజకీయ జీవితంలో మెరిట్స్ డీ మెరిట్స్ ఉన్నాయని ఆయన విశ్లేషించారు. పదహారు నెలల పాటు జైలులో ఉన్నా కూడా జగన్ జనంలోకి వచ్చి ప్రజల మన్ననలు పొంది 151 సీట్లతో అధికారంలోకి రావడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం అంటూనే రెండవ కోణలో జగన్ పట్టు తప్ప విడుపు లేని తనం వచ్చిన అవకాశాలను ఆయన సరిగ్గా వాడుకోలేకపోవడం మీద కూడా విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏపీకి రాజధాని అమరావతి విషయంలో జగన్ తప్పులు చేసుకుంటూ పోతున్నారు అని తులసి రెడ్డి అన్నారు.

గోల్డెన్ చాన్స్ మిస్ :

జగన్ అమరావతి రాజధాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం వల్ల ఈ రోజున ఏపీలోని మూడు ప్రాంతాలలో జనాల దృష్టిలో ఒక నమ్మలేని విధానంతో ఉన్న నేతగా నిలిచారు అని అన్నారు. ఆయన 2019 ఎన్నికలకు ముందు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను అని ఆ వైపునకు అనుకూలంగా మాట్లాడారు అని గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు దానికి న్యాయ స్థానాలలో ఓటమి ఎదురైంది అని చెప్పారు. అలాగే ప్రజా కోర్టులో సైతం 11 సీట్లకే పరిమితం అయ్యారని గుర్తు చేశారు. అయినా సరే జగన్ రాజధానికి చట్టబద్ధత విషయంలో తన పార్టీ పరంగా వ్యవహరించిన తీరుతో తో గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్నారు అన్నారు.

అవినీతి జరిగితే ప్రశ్నించాలి :

అమరావతి రాజధాని విషయంలో మూడు ప్రాంతాల ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు అని జగన్ అన్నారు. ఆ విషయంలో వారు జగన్ కానీ వైసీపీ కానీ చేసే వాదనతో ఏకీభవించరని అన్నారు. జగన్ తన పార్టీ ఎంపీలతో లోక్ సభ రాజ్యసభలలో వాకౌట్ చేయించకుండా చట్టబద్ధతకు మద్దతు ఇస్తూ అక్కడ అవినీతి జరిగితే ప్రశ్నించి ఉండాల్సి ఉందని అన్నారు. అలా చేసి ఉంటే జనాలకు రాజధాని మీద వైసీపీ క్లారిటీ ఇచ్చినట్లుగా ఉండేదని అన్నారు. కానీ మంచి అవకాశాన్ని వైసీపీ పోగొట్టుకుందని తులసి రెడ్డి అన్నారు.

అసెంబ్లీకి గైర్ హాజరు :

ఇక గడచిన రెండేళ్ళుగా అసెంబ్లీకి వైసీపీ గైర్ హాజరు కావడం మీద కూడా తులసి రెడ్డి తప్పు పట్టారు. ఇది కూడా సెల్ఫ్ గోల్ అని అన్నారు. అసెంబ్లీకే పోని పార్టీకి జనాలు ఎందుకు ఓటేయాలి అన్నది ఉత్పన్నం అయితే వైసీపీకే రాజకీయ నష్టం అని ఆయన అన్నారు. అదే విధంగా విపక్షంలో ఉన్న పార్టీగా సభలో ప్రజా సమస్యలను చర్చించాల్సి ఉండగా డుమ్మా కొట్టడం వైసీపీకే ఇబ్బందికరం అని అన్నారు.

రప్పా రప్పా అంటూ :

వైసీపీని ఇబ్బంది పెట్టే మరో అంశం రప్పా రప్పా రాజకీయం అని. అది పవర్ ఫుల్ స్లోగన్ అని అనుకుంటున్నారని తులసీరెడ్డి ఎద్దేవా చేశారు. జనాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ని అది కలుగచేస్తుందని ఆయన అన్నారు ఈ విషయం వైసీపీ అధినాయకత్వం గుర్తించకపోవడం విడ్డూరం అని అన్నారు. ఇలా వైసీపీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పోతోందని మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అంటే చూడాల్సి ఉందని తులసి రెడ్డి విశ్లేషించారు. మరి దీని మీద వైసీపీ నాయకులు ఎంత మంది అంగీకరిస్తారో చూడాలి. అయితే వైసీపీలోనూ అంతర్గతంగా వీటి మీదనే చర్చ సాగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా అధినాయకత్వం తీరు మారాలని అంతా కోరుకుంటున్నారు.