Begin typing your search above and press return to search.

బాబు కోసం ...జగన్ భారీ యాక్షన్ ప్లాన్

చంద్రబాబు ఇచ్చిన 150కి పైగా హామీలతో కూడినా మానిఫేస్టోని పట్టుకుని వైసీపీ క్యాడర్ ఇక ఇంటింటికీ తిరిరి వాటి మీద జనాలకు అవగాహన కల్పిస్తుంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 7:26 PM IST
బాబు కోసం ...జగన్ భారీ యాక్షన్ ప్లాన్
X

అదేంటి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చంద్రబాబు కోసం భారీ యాక్షన్ ప్లాన్ ని ఎందుకు చేస్తారు అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. అయితే బాబు కోసం అంటే బాబు పాలన మీద పూర్తి వ్యతిరేకత జనంలోకి రావడం కోసం అన్న మాట. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద జగన్ అతి పెద్ద యుద్ధమే ప్రకటించారు. హానీమూన్ పీరియడ్ కూటమికి ముగిసింది అని ఆయన అంటున్నారు. వైసీపీ ఇచ్చిన టైం అయిపోయింది అని కూడా చెప్పేశారు.

ఇక జనంలోనే తేల్చుకుంటామని అంటున్నారు. అందుకోసం ఏకంగా అయిదు వారాల పాటు ఒక భారీ ప్రొగ్రాం ని ఆయన డిజైన్ చేసి పార్టీ వారి చేతిలో పెట్టారు. ఇక మీరు ఇంటింటికీ తిరిగి జనాలలో బాబు పాలన పట్ల వ్యతిరేకత పెంచడమే పని అని నిర్దేశిస్తున్నారు. ఈ ప్రోగ్రాం కి రీకాల్ చంద్రబాబూస్ మేనిఫేస్టో అని పేరు పెట్టారు.

చంద్రబాబు ఇచ్చిన 150కి పైగా హామీలతో కూడినా మానిఫేస్టోని పట్టుకుని వైసీపీ క్యాడర్ ఇక ఇంటింటికీ తిరిరి వాటి మీద జనాలకు అవగాహన కల్పిస్తుంది. ఆ మీదట ఈ మ్యానిఫేస్టొలో అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్ ని కూడా జగన్ ఆవిష్కరించారు.

ఆ క్యూ ఆర్ కోడ్ మొత్తం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నీ ఉంటాయి. వీటిని ప్రతీ ఇంటికి వెళ్ళి అక్కడే ఓపెన్ చేసి జనాలకే వాటి మీద అభిప్రాయ సేకరణ చేస్తారు అని అంటున్నారు. మీకు ఏ పధకం అందింది అని వాకబు చేస్తారు. అంతే కాదు గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని పధకాలు అందాయి ఇపుడు ఏడాదిలో పధకాలు అమలు కాక ఎంతటి నష్టం ఒక్కో ఇంటికీ వచ్చిందో లెక్కలతో సహా వివరిస్తారు అని అంటున్నారు.

ఇక 2024 నుంచి పధకాలు బాబు ఇస్తామని చెప్పారు. ఏడాదిగా ఇవ్వలేదు, ఇపుడు అరకొరగా అమలు చేస్తున్నారు. దీని వల్ల ప్రతీ ఇంటికీ ఎంత బాకీ ఉందో పూర్తిగా జనాలకు విడమరచి చెప్పాలని కూడా జనాలకు చెప్పి వారి నుంచే బాబు మీద ఒత్తిడి పెట్టించాలని జగన్ పార్టీ నాయకులను కోరుతున్నారు.

ఇక వైసీపీ టెక్నాలజీతోనే బాబుని ఎదుర్కోవాలని చూస్తోంది. ఎలా అంటే వైసీపీ తయారు చేసిన క్యూ ఆర్ కోడ్ ని ప్రతీ ఇంటికి వెళ్ళి అక్కడే స్కాన్ చేస్తే మొదట రెండు సార్లు చంద్రబాబు ఎన్నికల మేనిఫేస్టో అలాగే బాండ్లు వస్తాయి. ఇక మూడవసారి చూస్తే కనుక ఆ కుటుంబానికి పధకాలు అందక ఎంత నష్టం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ఎంత బాకీ పడింది అన్నది పూర్తి వివరాలతో వస్తుందని అంటున్నారు.

ఇలా ఎక్కడికక్కడ క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేస్తూ జనాలకు తెలియ చేస్తూ ఆయా ప్రాంతాలకు కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన అన్యాయాల మీద మీడియా సమావేశాలతో పాటు స్థానికంగా సభలు సమావేశాలను కూడా వైసీపీ నేతలు ఏర్పాటు చేయాలని జగన్ సూచిస్తున్నారు. మొత్తానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను పూర్తిగా ఎండగట్టడంతో పాటు జనాలను ఇందులో మమేకం చేయడం ద్వారా పూర్తిగా రాజకీయ ప్రయోజనం పొందవచ్చునని వైసీపీ ఆలోచిస్తోంది. వైసీపీ తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం తో మరో నెలన్నర పాటు ఏపీలో రాజకీయ మోత మోగడం ఖాయమని అంటున్నారు.