Begin typing your search above and press return to search.

కల్తీ నెయ్యి ఇష్యూ నేపథ్యంలో జగన్ చేస్తున్న పని ఇంట్రెస్టింగ్ !

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.

By:  Satya P   |   25 Feb 2026 5:19 AM IST
కల్తీ నెయ్యి ఇష్యూ నేపథ్యంలో జగన్ చేస్తున్న పని ఇంట్రెస్టింగ్ !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఆయన మూడు రోజుల పర్యటన కోసం మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రజా దర్బార్ పేరుతో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ఈసారి పర్యటనలో ఒక ఆసక్తికరమైన విషయమే చోటు చేసుకోనుంది. అది కూడా ఏపీలో కల్తీ నెయ్యి విషయంలో హాట్ హాట్ గా డిబేట్ సాగుతున్న నేపధ్యంలో జగన్ చేస్తున్న ఈ కార్యక్రమం అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంది అని అంటున్నారు.

ఆలయ విగ్రహ ప్రతిష్టాపన :

ఇక వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని వేంపల్లి మండలంలో నందిపల్లి లో ఈ నెల 25 బుధవారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు అని అంటున్నారు అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయానికి సంబంధించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో జగన్ పాల్గొనడమే కాకుండా ప్రత్యేక పూజలు చేస్తారు అని అంటున్నారు.

జగన్ మీద ఆ విమర్శలు :

ఇక ఏపీలో చూస్తే రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. మతపరమైన అంశాలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ క్రిస్టియన్ మతస్థుడు కాబట్టే తిరుమల లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి కలిపినా పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం పెద్దలు ఆరోపిస్తున్నారు. గత ఇరవై నెలలుగా ఇదే వాదన ఆ వైపు నుంచి వస్తోంది ఇక వైసీపీ నేతలు అయితే జగన్ ఏ మతస్థుడు అయినా హిందూ మతాన్ని ఎప్పుడూ గౌరవిస్తూ వస్తున్నారు అని గట్టిగా చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని అయితే జగన్ ఎన్నో దేవాలయాలను తన అయిదేళ్ళ సీఎం పాలనలో కట్టించారు అని చెప్పుకొచ్చారు. జగన్ తిరుమల పవిత్రతను కాపాడారని కూడా ఆయన చెప్పారు.

కీలక సందర్భంలో :

ఇక వైఎస్సార్ కూడా క్రిస్టియన్ మతం ఆరాధకుడే అయినా ఆయన విషయంలో ఎన్నడూ ఈ తరహా విమర్శలు రాలేదు, ఆయనను ప్రత్యేకంగా ఒక మతానికి కట్టి చూడడం జరగలేదు, రాజకీయ విమర్శలే ఆయన మీద ప్రత్యర్ధులు చేస్తూ వచ్చేవారు. అయితే జగన్ మీద మాత్రం ఈ విమర్శలు ఎక్కుపెడుతూండడంతో వైసీపీ డిఫెన్స్ లో పడుతోంది. దాంతో వైసీపీ చెప్పాల్సింది చెబుతోంది కానీ మరింత చేయాల్సింది ఉందని అంటున్నారు. ఈ క్రమంలో జగన్ తానుగా స్వయంగా ఒక హిందూ టెంపుల్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం అన్నది చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు

జగన్ సీఎం గా ఉండగా విశాఖలో రుషికొండ వద్ద శ్రీ వెంకటేశ్వర ఆలయం కట్టించారు. అయితే దాని ప్రారంభానికి జగన్ రాలేదు, ఆయన అప్పట్లో విశాఖ పలు మార్లు వచ్చినా ఆ ప్రోగ్రాం మాత్రం చేయలేకపోయారు. దాని మీద కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇపుడు మాత్రం జగన్ ప్రత్యేకంగా ఒక ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు హాజరవుతూండడం మీద అయితే ఏపీ రాజకీయాల్లో చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఈ కార్యక్రమం ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో ఏమిటో అన్నది.