Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌లో అప్ప‌టి ఊపు... ఉత్సాహం ఇప్పుడెక్కడ ... ?

వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఊపు ఉత్సాహం కరువైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 4:04 PM IST
జ‌గ‌న్‌లో అప్ప‌టి ఊపు... ఉత్సాహం ఇప్పుడెక్కడ ... ?
X

వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఊపు ఉత్సాహం కరువైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సహజంగా జగన్ రాజకీయంగా ఏం మాట్లాడినా.. ఎవరిపై విమర్శలు చేసినా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహంగా వ్యాఖ్యానిస్తారు. కానీ, తాజాగా బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం ఆయన చాలా నిరుత్సాహంగా కనిపించారు. ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే తీరు గమనిస్తే జగన్లో స్పష్టంగా తేడా కనిపించింది.

మరి ఈ తేడా ఎందుకు వచ్చింది.. అంటే ప్రస్తుతం ఆయన చుట్టూ అనేక కేసులు ముసురుకున్నాయి. ప్రధానంగా ఆయన ఇంటి నుంచి కారును పోలీసులు తీసుకువెళ్లడంపై మానసికంగా ఆయన ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. సహజంగా కేసు పెట్టి అందులో జగన్ పేరు చేర్చడంపై కంటే కూడా వ్యక్తిగతంగా ఆయన ఇంటి నుంచి కారు తీసుకెళ్లడాన్ని జగన్ కొంచెం ఫీల్ అవుతున్నారని సమాచారం. దీనికి తోడు పార్టీ నాయకుల పై వరుసగా నమోదు అవుతున్న కేసులు కూడా జ‌గ‌న్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.

పైకి గంభీరంగా ఉన్నా.. అరెస్ట‌యిన‌ వారిని బయటకు తీసుకురాలేని పరిస్థితి వంటి పరిణామాలు కూడా మానసికంగా జగన్ ను కుంగ‌ తీస్తున్నాయని చెప్పాలి. సహజంగా ధైర్యం, సాహసం వంటి వాటికి జగన్ పేరును పర్యాయపదంగా చెబుతారు. కానీ, మారుతున్న కాలం.. మారుతున్న పరిస్థితులు వంటివి జగన్ను ఆ దిశగా నడిపించడంలో కాస్త వెనుకబాటు కనిపించింది. ఇదే సమయంలో నిరుత్సాహానికి కారణం కూడా అదేన‌ని చెప్పాలి. దీనికి తోడు ఏడాది కాలంలో కూటమిలో అనైక్యత చోటు చేసుకుంటుందని అనుకున్నారు.

అంతేకాదు.. ఎక్కడో ఒక చోట విభేదాలు వస్తాయని జగన్ అంచనా వేసుకున్నారు. కానీ అలా జరగలేదు. పైగా కూట‌మి బలంగా ఉందన్న సంకేతాలు తాజాగా జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. ఇది కూడా జగన్కు మానసిక ఆవేదనను పెంచిందని చెప్పాలి. ఎలా చూసుకున్నా రాజకీయంగా జగన్ కి ఇప్పుడు ఒక సంక్లిష్ట పరిస్థితి అయితే ఏర్పడిందనేది పరిశీలకులు చెబుతున్న మాట. అందుకే ఆయ‌న‌లో ఊపు, ఉత్సాహం కొర‌వ‌డిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.