వైసీపీలో సమూల మార్పులు.. ప్లాన్ అదేనట !
వైసీపీలో సమూలమైన మార్పులకు అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం స్ట్రక్చర్ లో భారీ మార్పులు చేయనున్నారు అని అంటున్నారు.
By: Satya P | 13 Feb 2026 8:15 AM ISTవైసీపీలో సమూలమైన మార్పులకు అధినేత వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం స్ట్రక్చర్ లో భారీ మార్పులు చేయనున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతల సంఖ్యను మరింతగా పెంచుతారు అని అంటున్నారు. వైసీపీ అంటే ఒకరిద్దరు నేతల పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు జగన్ కోటరీ వారు అని విమర్శలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వారు అదే పనిగా కేంద్ర కార్యాలయంలో ఉన్న వారి మీదనే బాణాలు ఎక్కు పెడుతున్నారు.
సామాజిక సమీకరణతో:
ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో కీలక మార్పులు తీసుకుని రావాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలను ఉంచాలని చూస్తున్నారు అని అంటున్నారు. మాజీ మంత్రులు దశాబ్దాలుగా పార్టీలో ప్రభుత్వంలో పనిచేసిన వారికి బాధ్యతలు అప్పగిస్తే మరింత సమర్ధంగా వైసీపీ వాణి జనంలోకి వెళ్తుంది అని ఆలోచన చేస్తున్నారు అని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రాకు ప్రయారిటీ :
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన మాజీ మంత్రి మండలిలో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణకు ప్రయారిటీ ఇస్తారు అని అంటున్నారు. అలాగే పార్టీ అధికార ప్రతినిధులు పార్టీ కీలక పదవులలో కూడా సీనియర్లను కొన్ని చోట్ల మహిళా నేతలను, యువ నాయకులను నియమించడం ద్వారా వైసీపీకి కొత్త రూపు ఇవ్వాలని చూస్తున్నారు అని అంటున్నారు.
ధీటుగా స్పందన :
రానున్న రోజులు ఎంతో ముఖ్యమైనవి అని వైసీపీ భావిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళకు దగ్గర పడుతోంది. వ్యతిరేకత ఏమైనా ఉంటే ఇపుడే బయటపడే చాన్స్ ఉందని భావిస్తోంది. దానిని ఒడుపుగా అందుకోవాల్సి ఉంది. సెల్ఫ్ గోల్స్ వేసుకోకుండా ధీటుగా అధికార పక్షానికి జవాబు చెప్పాల్సి ఉంది.అదే సమయంలో తమ పార్టీ ప్రభుత్వ విధానాలు సమర్ధించుకోవాల్సి ఉంది. దాంతో సీనియర్లు ఆలోచనాపరులకు చోటు ఇవ్వాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
బూత్ లెవెల్ దాకా :
మరో వైపు బూత్ లెవెల్ దాకా పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అది జరిగిన తరువాత రాష్ట్ర స్థాయిలో కమిటీని వేస్తారని అంటున్నారు. ఆ కమిటీలో పనిచేసే వారికి జనాలకు పార్టీ గురించి గట్టిగా చెప్పే వారికి అధికార పక్షాన్ని తట్టుకునే వారికి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా వైసీపీ అంటే ప్రస్తుతం కేంద్ర కార్యాలయంలో వినిపిస్తున్న ఒకరిద్దరు నేతలు మాత్రమే కాదని గట్టిగా చాటి చెప్పాలన్నది పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం మేరకు ఏమి జరుగుతుందో.
