Begin typing your search above and press return to search.

విజయవాడలోనే ఉన్నానంటూ జగన్ షాకింగ్ కామెంట్స్

లిక్కర్ స్కాం లో తనను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని మీడియా ప్రశ్నించినపుడు వైసీపీ అధినేత మాజీ సీఎం షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   22 May 2025 4:04 PM IST
YS Jagan Responds Strongly to Liquor Scam Arrest Attempts
X

లిక్కర్ స్కాం లో తనను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని మీడియా ప్రశ్నించినపుడు వైసీపీ అధినేత మాజీ సీఎం షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. నేను ఇపుడు విజయవాడలోనే ఉన్నాను. ఎవరూ ఎవరినీ ఆపరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.

అంటే అరెస్ట్ చేయడానికి వస్తే ఆపేది లేదు కదా అన్న అర్ధంలో ఆయన వ్యాఖ్యానించారు అని అంటున్నారు. తాను అరెస్ట్ కి భయపడడం లేదు అన్నట్లుగానే ఆయన చెప్పారని అంటున్నారు. అదే సమయంలో అక్రమంగా లేని దాన్ని చూపించి కేసులు పెడుతున్నారని ఆయన కూటమి ప్రభుత్వం మీద విమర్శలు సంధించారు.

అంతే కాదు తనను గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించిందని ఆయన గుర్తు చేశారు. అయితే తనకు అరెస్టులు కొత్త కాదని తన పార్టీ వారికి ఇబ్బందులు అన్నవి కొత్త కాదని ఆయన అన్నారు. ఈ ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టింది, ఎదిగింది, కొనసాగుతోంది అని ఆయన అన్నారు. తాను కూడా ఒక నాయకుడిగా ఎదిగాను అని అన్నారు.

ఎక్కడైనా అరెస్టులు కేసులు అన్నది ప్రశ్న కాదని వాటిలో న్యాయం ఎంత ఉంది అన్నదే చూడాలని ఆయన అన్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యంలో అది కుదిరే పని కాదని అన్నారు. అలాగే న్యాయం ధర్మం వైపు దేవుడు ఉంటాడని తప్పకుండా దుర్బుద్ధితో చంద్రబాబు చేసే అరెస్టుల మీద మొట్టికాయలు వేస్తారని అన్నారు.

లిక్కర్ స్కాం అని కొత్త కధలు కూటమి ప్రభుత్వం చెబుతోంది అని ఆయన ఫైర్ అయ్యారు. అసలైన స్కాం ఇపుడే జరుగుతోంది అని అన్నారు. ఇక ఢిల్లీలో మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఆయన ప్రభుత్వం నుంచి మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయడం మీద కేసులు పెట్టారని అన్నారు. తమ ప్రభుత్వం ఏకంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి మద్యం దుకాణాలను తీసుకుని తానే నడిపిందని ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమంలో ఎక్కడ అవినీతి ఉంటుందని ఆయన నిలదీశారు.

ఇవన్నీ ఇలా ఉంటే అరెస్టులకు తాను భయపడడం లేదన్న సంకేతాలను జగన్ ఇచ్చారు. అంతే కాదు తాను విజయవాడలోనే ఉన్నాను అని ఆయన చెప్పడాన్ని కూడా చూస్తే కనుక తాను కూల్ గానే ఉన్నట్లుగా మేసేజ్ పంపారని అంటున్నారు. అయితే జగన్ ని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందని డేట్ టైం వంటివి ఆలోచిస్తోందని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఏది జరిగితే జరగనీ అన్నట్లుగానే జగన్ వైఖరి ఉందని అంటున్నారు.

మరి జగన్ జవాబుని ఆయన స్పందనను సవాల్ గా తీసుకుని కూటమి ప్రభుత్వం ఉందుకు అడుగులు వేస్తుందా అరెస్టులకు సంబంధించి ఏమైనా రాజకీయ ప్రకంపనలు తొందరలోనే రేగే అవకాశం ఉందా అన్నదే ఇపుడు అంతటా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.