కేసీఆర్ భేష్...బాబు అమరావతి మీద జగన్ హాట్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మధ్యలోకి తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ని కూడా తీసుకుని వచ్చారు.
By: Tupaki Desk | 22 May 2025 3:44 PM ISTఏపీ సీఎం చంద్రబాబు మీద మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మధ్యలోకి తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ని కూడా తీసుకుని వచ్చారు. అమరావతి రాజధానికి భారీ కాన్వాస్ మీద డిజైన్లు చేస్తున్న బాబు వైఖరిని ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ ని ఉదహరిస్తూ ఆయన చక్కగా సచివాలయం కట్టారు, చూసి నేర్చుకోరాదే అని కూడా ఒక సలహా ఇచ్చారు.
జగన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పాలన మీద ఆయన వైఖరి మీద నిప్పులు చెరిగారు. కేసీఆర్ హైదరాబాద్ లో ఎనిమిది లక్షల 58 వేల స్క్వేర్ ఫీట్లలో 616 కోట్ల రూపాయలతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారని గుర్తు చేశారు.
మరి చంద్రబాబు అమరావతిలో 53 లక్షల 57 వేల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి స్వామీ వింత కాకపోతేనూ అని ఎద్దేవా చేశారు. అతి తక్కువ ఖర్చుతో కేసీఆర్ మంచి సెక్రటేరియట్ నిర్మించారు అని జగన్ ఆయనకు మద్దతు పలుకుతూ బాబు అమరావతి రాజధానిలో నిర్మాణం చేస్తున్న భారీ కట్టడాలు వాటికి అయ్యే ఖర్చు ఆర్భాటాలను పూర్తి స్థాయిలో ఎండగట్టారు.
ఆ విధంగా జగన్ అమరావతిలో కొత్త సచివాలయ నిర్మాణంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు 12 వేల మంది సిబ్బందికి ఇంత విస్తీర్ణం ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా బాబు చేస్తున్నది ప్రజల కోసం కానే కాదని కాంట్రాక్టులు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ ప్రయత్నమని జగన్ నిందించారు.
మరో వైపు చూస్తే అప్పులలో చంద్రబాబు తన పాలనను అధిగమిస్తారేమో అన్న సందేహాన్ని జగన్ వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పాలనలో అయిదేళ్ళలో మూడు లక్షల 32 వేల 671 కోట్ల రూపాయలు చేస్తే చంద్రబాబు కేవలం పన్నెండు నెలల్లోనే ఒక లక్షా 37 వేల 546 కోట్ల రూపాయలు చేశారు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జగన్ మీడియాకు చూపించారు.
అంటే వైసీపీ అయిదు సంవత్సరాలలో చేసిన అప్పులలో ఏకంగా 41 శాతం అప్పు ఒక్క సంవత్సర కాలంలోనే చంద్రబాబు చేశారని జగన్ ఘాటుగా విమర్శించారు. ఇంతలా ఏపీలో అప్పులు చేస్తున్న బాబు ప్రభుత్వం ప్రజలకు చేసింద మేలు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
వార్షిక బడ్జెట్ వరకు చూస్తే కనుక 30.10 శాతం అదనంగా అప్పులు చేశారని ఆయన్ ఆన్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసారని మరి ఈ డబ్బులు మొత్తం ఎక్కడిపోతున్నాయి అని ఆయన నిలదీశారు. ఈ డబ్బులు అన్నీ చంద్రబాబు జేబుల్లోకి అలగే ఆయన గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తున్నాయని జగన్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఏపీ ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదని ఆయన అన్నారు.
ఇక ఆయన ఈనాడు మీడియా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు పేపర్ లో సెకీకి సంబంధించిన విషయంలో తనపైన నాపైన రాసిన వార్తలు చూసిన తరువాత ఒక్కటే అంబిపించింది అని జగన్ అన్నారు. ఈనాడు పేపర్ టాయిలెట్ పేపర్ కు ఎక్కువ టిష్యూ పేపర్ కు తక్కువ అని ఎద్దేవా చేశారు. అబద్దాలు రాయడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా అని ఈనాడు మీద ఆయన విమర్శలు చేశారు.
మొత్తం మీద చూస్తే జగన్ తనదైన శైలిలో ప్రతీ విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ తన దగ్గర అన్ని విషయాలు లెక్కలతో సహా ఉన్నయని కూటమి ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రభుత్వం ఏడాది పాలలో ఏమీ చేయకపోగా వైసీపీ నేతలను కార్యకర్తలను వేధిస్తోంది అని ఆయన అన్నారు.
