Begin typing your search above and press return to search.

భారీ ప్లాన్ లో జగన్...బెంగళూరు నుంచే స్కెచ్

పార్టీ గ్రాఫ్ ని అలా ఇంచి ఇంచి పెంచుకుంటూ పోవాలని చూస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి.

By:  Satya P   |   11 Nov 2025 9:33 AM IST
భారీ ప్లాన్ లో జగన్...బెంగళూరు నుంచే స్కెచ్
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ భారీ ప్లాన్ లో ఉన్నారా. పార్టీ గ్రాఫ్ ని అలా ఇంచి ఇంచి పెంచుకుంటూ పోవాలని చూస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. జగన్ ఇంకో రెండు నెలలలో పూర్తి స్థాయిలో జనంలోకి వస్తాయని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కొత్త ఏడాది 2026 సంక్రాంతి తరువాత జగన్ మార్క్ యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.

బస్సు యాత్ర ముందు :

ఇక జగన్ బస్సు యాత్రతో ప్రజల వద్దకు రావాలని చూస్తున్నారు. ఏపీలో 26 పార్లమెంట్ సీట్లు ఉన్నారు. అలా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర చేస్తారని పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ వీలున్న చోటల్లా జనాలతో కనెక్ట్ అవ్తూఅరు అని అంటున్నారు. ఈ విధంగా వరానికి నాలుగైదు రోజుల పాటు ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు ద్వారా పర్యటిస్తారు అని అంటున్నారు. పార్టీ గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉంది, నాయకుల పనితీరు ఏమిటి క్యాడర్ మనో భావాలు ఎలా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలు ఏమిటి అన్నది కూడా జగన్ పూర్తిగా స్వయంగా అధ్యయనం చేస్తారు అని అంటున్నారు.

ప్లీనరీతో దూకుడు :

ఇక వైసీపీ ప్లీనరీని కూడా 2026లో ఘనంగా నిర్వహిస్తారు అని అంటున్నారు. జూలైలో వైఎస్సార్ జయంతి సందర్భంగా రెండు రోజుల పాటు జరుగుతుంది అని అంటున్నారు. 2022 జూలైలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఎంతో గొప్పగా ప్లీనరీ సాగింది. ఆ తరువాత మళ్ళీ నిర్వహించినది లేదు. అయితే ఈసారి ప్రతిపక్షంలో ఉండడంతో క్యాడర్ లో ఊపు తీసుకుని వచ్చేందుకు బ్రహ్మాండంగా నిర్వహించాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

పాదయాత్ర కోసమే :

ఇక జగన్ పాదయాత్రను 2027లో ప్రారంభిస్తారు అని అంటున్నారు. దనికి సంబంధించిన విషయాలను కూడా ప్లీనరీలో చర్చిస్తారు అని అంటున్నారు ఆ మీదట ఏకంగా అయిదు వేల కిలోమీటర్లతో భారీ పాదయాత్రకు జగన్ శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఈసారి రెండేళ్లకు పైగా పాదయాత్ర సాగుతుందని 2029 ఎన్నికలకు ఈ పాదయాత్ర ఒక బూస్ట్ గా పనిచేస్తుందని జగన్ నమ్ముతున్నారు.

బూత్ లెవెల్ నుంచి :

ఇక పార్టీని ముందు పటిష్టం చేయడం కోసం జగన్ చూస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్రంలో పార్టీ అత్యున్నత వేదిక అయిన పీఏసీ దాకా పార్టీకి కొత్త నాయకత్వాన్ని యువ నాయకత్వాన్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. సీనియర్ల సేవలను ఉపయోగించుకుంటూనే పార్టీలో యంగ్ బ్లడ్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో ఇన్నాళ్ళూ సాగుతున్న సైలెంట్ కి చెక్ పెడుతూ 2026 లో జగన్ బస్సు దూసుకుని వస్తుందని అంటున్నారు. చూడాలి మరి