అత్యధిక వ్యూస్ కలిగిన యూట్యూబ్ వీడియోస్ ఇవే!
అవును... అత్యంత ప్రజాధరణ పొందిన వీడియో ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ లో కొన్ని వీడియోలో వ్యూస్ లో రికార్డులు సృష్టించాయి.
By: Tupaki Desk | 30 April 2025 8:00 AM ISTగూగుల్ యాజమాన్యంలోని ఆన్ లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్.. డిజిటల్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది మనసులను దోచుకుంటున్న సంగతి తెలిసిందే. అందరికీ వీడియో కంటెంట్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2005లో ప్రారంభించబడిన ఈ ఫ్లాట్ ఫామ్ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది.
ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఫ్లాట్ ఫామ్ సుమారు 2.75 బిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది! ఇది.. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే రెండో వెబ్ సైట్ కాగా.. రెండో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అని చెబుతున్నారు. ఈ సమయంలో యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ కలిగిన వీడియోస్ ఏవనేది ఇప్పుడు చూదామ్!
అవును... అత్యంత ప్రజాధరణ పొందిన వీడియో ఫ్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్ లో కొన్ని వీడియోలో వ్యూస్ లో రికార్డులు సృష్టించాయి. ఇందులో టాప్ 5 వీడియోలను ఇప్పుడు చూద్దామ్!
ఇందులో భాగంగా... దక్షిణ కొరియా కంపెనీ అయిన పింక్ ఫాంగ్ సృజనాత్మక కేంద్రం నుంచి వెలువడిన వైరల్ సెన్సేషన్ "బేబీ షార్క్ డాన్స్".. యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన వీడియోగా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ వీడియోను 17 జూన్ 2016లో అప్ లోడ్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటివరకూ సుమారు 1,500 కోట్ల వ్యూస్ ఉన్నాయి.
ఇదే సమయంలో... డాడీ యాంకీ నటించిన లూయిస్ ఫోన్సీ పాడిన హిట్ పాట "డెస్పాసిటో".. దాని సంగీతం, లయ పరంగా యూట్యూబ్ లో వ్యూస్ లో రెండో స్థానంలో నిలిచింది. 2017 జనవరి 12న విడుదలైన ఈ వీడియో సుమారు 850 కోట్లకు పైగా వ్యూస్ ని కలిగి ఉంది.. యూట్యూబ్ ని ఊపేస్తోంది.
ఇక.. కోకామెలాన్ యూట్యూబ్ ఛానల్ లోని "వీల్ ఆన్ ది బస్" అనే వీడియో వ్యూస్ లో టాప్ 3 ప్లేస్ లో నిలిచింది. ఈ పాట పిల్లలను కలిసి పాడటానికి, డ్యాన్స్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో 2018 మే 24న అప్ లోడ్ అయిన ఈ వీడియో 743 కోట్లకు పైగా వ్యూస్ ని సంపాదించింది.
ఇదే క్రమంలో... కోకోమిలాన్ యూట్యూబ్ ఛానల్ లోని మరో వీడియో "బాత్ సాంగ్" విలువైన పాఠంగా ఉంది! ఇది 2018 మే 2 న పబ్లిష్ అవ్వగా... ఇది 708 కోట్లకు పైగా వ్యూస్ ని కలిగి ఉంది. ఇది పిల్లలకు శుభ్రంగా ఉండటం, తమను తాము చూసుకోవడానికి సంబంధించిన ప్రాముఖ్యతను బోధిస్తుంది.
ఇదే సమయంలో... లూలూ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి విడుదలైన "జానీ జానీ ఎస్ పాపా" అనే పిల్లల కవితగా మారిన ప్రసిద్ధ వీడియో గురించి చాలా మందికి తెలిసిందే. ఈ యూట్యూబ్ వీడియో 2016 అక్టోబర్ 8న అప్ లోడ్ అవ్వగా... 706 కోట్లకు పైగా వ్యూస్ ను కలిగి ఐదో స్థానంలో ఉంది.
