Begin typing your search above and press return to search.

యువతి షాక్... బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో 13 వేల "ఆ" ఫొటోలు

ఈ క్రమంలోనే తాజాగా సహజీవనం చేస్తున్న ఒక యువతికి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూస్తే షాక్ తగిలింది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 11:40 AM GMT
యువతి షాక్... బాయ్  ఫ్రెండ్ ఫోన్  లో 13 వేల ఆ ఫొటోలు
X

గత కొంతకాలంగా సహజీవనం అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నగరాల్లో ఇదొక ట్రెండ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జరుగుతున్న అకృత్యాలు, దారుణాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సహజీవనం చేస్తున్న ఒక యువతికి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూస్తే షాక్ తగిలింది.

అవును... ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడితో సహజీవనం చేస్తున్న యువతికి షాక్ తగిలింది. ఇందులో భాగంగా... తన భాగస్వామితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను డిలీట్ చేయాలని చేసిన ప్రయత్నంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫోన్ లో ఉన్నవి తన ఫోటోలు మాత్రమే కాదు.. వాళ్ల ఆఫీసులో తన సహచరుల ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి.

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన ఒక యువతి ఓ బీపీవో కంపెనీలో పనిచేస్తోంది. ఈ సమయంలో తనతో పాటు పనిచేస్తున్న యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇలా సుమారు 4 నెలలుగా వీరు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ యువకుడు ఫొటోలు తీశాడట. దీంతో వాటిని ఫోన్ లో నుంచి తొలగించాలని ఆమె ప్రయత్నించిందట.

ఇందులో భాగంగా ఒకరోజు ఆ యువకుడు నిద్రపోతున్న సమయంలో అతని ఫోన్ ఓపెన్ చేసింది సదరు యువతి. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైందంట. అందులో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 13వేల "ఆ" ఫోటోలు దర్శనమిచ్చాయంట. వాటిలో ఈమె ఫోటోలతో పాటు వాళ్ల ఆఫీసులో మరికొంతమంది మహిళల ఫోటోలు కూడా కనిపించాయంట.

ఆ 13వేల ఫోటోలలోనూ కొన్ని ఒరిజినల్ గా తీసినవి కాగా.. మరికొన్ని మార్ఫింగ్ అని చెబుతున్నారు! దీంతో షాక్ నుంచి తేరుకున్న యువతి... ఈ విషయాన్ని సంస్థ మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లింది! దీంతో ఉద్యోగుల సేఫ్టీ దృష్ట్యా యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారట. దీంతో ఆ యువతితో పాటు.. పలువురు ఇతర ఉద్యోగులు బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.