Begin typing your search above and press return to search.

కాల్ గర్ల్స్ కోసం కక్కుర్తి పడ్డాడు... టెక్కీ సరదా తీరిపోయింది!

బెంగళూరులోని రాజీవ్‌ గాంధీ నగర్‌ కు చెందిన ఒక యువకుడు కాల్ గర్ల్స్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 5:15 AM GMT
కాల్ గర్ల్స్ కోసం కక్కుర్తి పడ్డాడు... టెక్కీ సరదా తీరిపోయింది!
X

ఈ మధ్యకాలంలో కాల్ గర్ల్స్ కోసం ఆన్ లైన్ లో యాప్స్ ద్వారా సెర్చ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో గరిష్టంగా మోసలే ఉంటాయని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా కాల్ గర్ల్స్ ని పంపిస్తామని చెప్పి న ఇద్దరు వ్యక్తులు... అనంతరం ఒక వ్యక్తికి షాకిచ్చారు.

అవును... కాల్ గర్ల్స్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి ఒక యాప్ లో ఫోన్ నెంబర్ కనిపించింది. వెంటనే ఆ ఫోన్ కు వాట్సప్ కాల్ చేశాడు. దీంతో అమ్మాయ్ని రిసీవ్ చేసుకోవడానికి ఫలాన చోటికి రమ్మని అవతలి నుంచి సమాచారం రావడంతో బయలుదేరి వెళ్లాడు. బలైపోయాడు!

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులోని రాజీవ్‌ గాంధీ నగర్‌ కు చెందిన ఒక యువకుడు కాల్ గర్ల్స్ కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అమ్మాయిని పంపిస్తామని.. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి రిలయన్స్ డిజిటల్ సెక్టార్ 6 ప్రాంతానికి రావాలని తెలిపారు. దీంతో ఉత్సాహంతో బయలుదేరాడు సదరు యువకుడు.

ఆ రాత్రి సమయంలో కాల్ గర్ల్ కోసం ఒంటరిగా బయలుదేరాడు. ఫోన్ లోని వ్యక్తులు చెప్పిన ప్రాంతానికి వెళ్లిన యువకుడికి అక్కడ షాక్ తగిలింది. ఇతడిని చుట్టుముట్టిన ముగ్గురు వ్యక్తులు... బలవంతంగా ఆటో ఎక్కించారు. అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్లారు.

అప్పుడు ఆ యువకుడు తన వద్ద ఉన్న రెండు వేల రూపాయలు ఇచ్చాడు. అనంతరం యూపీఐ ద్వారా సుమారు 60,000 రూపాయలు ఆ యువకుడి నుంచి బలవంతంగా పంపించుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. వెతికి మరీ చంపేస్తామని బెదిరించారు.

దీంతో... ఈ విషయంపై హెచ్‌.ఎస్‌.ఆర్‌. లేఅవుట్‌ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూపీఐ పేమెంట్ ద్వారా ఆ వ్యక్తులను గుర్తించారు. వారిలో నగేష్, నదీమ్ పాషాలను అరెస్టు చేశారు.

అనంతరం నిందితుల నుంచి అరవై వేల రూపాయలతోపాటు.. నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు చంద్రశేఖర్ పరారీలో ఉండడంతో అతడి పోలీసులు గాలిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ యాప్ లలోని అమ్మాయిల ఫోటోలు చూసి టెంప్ట్ అయ్యి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు!