Begin typing your search above and press return to search.

ఒక యువతి 2 ప్రేమలు.. హత్యతో క్రైం థ్రిల్లర్

మారిన రోజులకు తగ్గట్లే మనుషుల మధ్య బంధాలు అంతకంతకూ బలహీనపడటమే కాదు.. గతంలో వినని రీతిలో క్రౌంస్టోరీలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   7 Feb 2024 4:12 AM GMT
ఒక యువతి 2 ప్రేమలు.. హత్యతో క్రైం థ్రిల్లర్
X

మారిన రోజులకు తగ్గట్లే మనుషుల మధ్య బంధాలు అంతకంతకూ బలహీనపడటమే కాదు.. గతంలో వినని రీతిలో క్రౌంస్టోరీలు చోటు చేసుకుంటున్నాయి. మనిషిని చంపేయటం ఇంత తేలికా? అన్న రీతిలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి తెర మీదకు వచ్చింది. ఇద్దరి వ్యక్తులతో ప్రేమ వ్యవహారం సాగించిన యువతి.. తాజాగా అందులో ఒకరిని మరో ప్రేమికుడి సాయంతో చంపేయించింది. ఈ సంచలన క్రైం స్టోరీలోకి వెళితే..

కోల్ కతా ఎయిర్ పోర్టులోని రెస్టారెంట్ లో 25 ఏళ్ల అంజలి షా పని చేస్తుంది. ఆమెకు వికాశ్ షా అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే.. ఏడాది క్రితం ఆమెకు మహారాష్ట్రలోని ఫూణెకు చెందిన 42 ఏళ్ల సందీప్ కాంబ్లీ అనే కార్ల డీలర్ తో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసిన సందీప్ కాంబ్లీ ఆమెను వేధించటం షురూ చేశాడు.,

దీంతో ఆమె వికాశ్ కు విషయం చెప్పింది. అతన్ని అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిన వారిద్దరు సందీప్ కాంబ్లీని టార్గెట్ చేవారు. అతన్ని కోల్ కతాకు రావాలని అంజలి కోరింది. అయితే.. తనకు అక్కడకు రావటం కుదరదని.. గువహటికి వస్తానని చెప్పాడు. దీంతో.. ఆమె ఓకే చెప్పింది. తన బస కోసం సందీప్ కాంబ్లీ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూం బుక్ చేశాడు. అదే హోటల్ లో వికాశ్ సైతం ఒక రూంను బుక్ చేసుకున్నాడు.

అంజలి.. కాంబ్లీ ఇద్దరు ఏకాంతంలో ఉన్న వేళలో అతడి గదిలోకి చొరబడిన వికాశ్ అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కాంబ్లీ మరణించాడు. దీంతో అతడి ఫోన్ తీసుకున్న ఇద్దరు వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసి.. ఎయిర్ పోర్టుకు వెళ్లారు. మరోవైపు హోటల్ సిబ్బంది కాంబ్లీ డెడ్ బాడీని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఎయిర్ పోర్టులో ప్రయాణికుల జాబితాను పరిశీలించగా.. అందులో వీరిద్దరు ఉన్నారు. దీంతో.. వారిని ఎయిర్ పోర్టుకు దగ్గర్లోని ఒక హోటల్ లో వారిద్దరూ ఉన్నారు. ఏ మాత్రం ఆలస్యమైనా వారు కోల్ కతాకు వెళ్లిపోయేవారిన పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరు ఊచలు లెక్కిస్తున్నారు. అందుకే తప్పుడు పనులు చేస్తే.. వారెంతటి వారైనా శిక్ష తప్పదు.