Begin typing your search above and press return to search.

చిన్న వయసులోనే పైలట్.. కమోరా ది గ్రేట్

కమోరా ఫరీలాండ్ అతి పిన్న వయసులోనే పైలట్ అయిన మహిళ. 17 ఏళ్ల ప్రాయంలోనే పైలట్ గా లైసెన్స్ పొంది రికార్డు సాధించింది.

By:  Tupaki Desk   |   26 March 2024 11:30 PM GMT
చిన్న వయసులోనే పైలట్.. కమోరా ది గ్రేట్
X

మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందట. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. ఎవరెస్ట్ అయినా అవలీలగా ఎక్కొచ్చు. పసిఫిక్ సముద్రంలో ఈత కొట్టొచ్చు. తలకోన జంగల్లో జాగింగు చేయొచ్చు. ఇలా చెబుతుంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే. సాధించాలనే తపన ఉంటే ఏ కార్యమైనా మనకు సలాం కొట్టాల్సిందే. ఎంతటి మహత్తరమైనా తలవంచాల్సిందే.

కమోరా ఫరీలాండ్ అతి పిన్న వయసులోనే పైలట్ అయిన మహిళ. 17 ఏళ్ల ప్రాయంలోనే పైలట్ గా లైసెన్స్ పొంది రికార్డు సాధించింది. యూరప్ ఏవియేషన్ ఆమెకు సుమారు 12 మంది ప్రయాణికులో కూడిన విమానాన్ని నడిపేందుకు అనుమతి ఇస్తూ లైసెన్స్ జారీ చేయడం విశేషం. ఆమె ఎల్లప్పుడు సముద్ర జీవశాస్త్రంపైనే ఫోకస్ పెట్టింది. ఏవియేషన్ వైపు ఆమె ధ్యాస మళ్లింది.

15 ఏళ్ల వయసులోనే విమానం నడపాలని నిర్ణయించుకుంది. కమోరా తానెప్పుడు పైలట్ కావాలని అనుకోలేదు. అనుకోకుండా జరిగిన పరిణామంలో భాగంగానే ఆమె పైలట్ అవతారం ఎత్తిందట. తొలిసారిగా విమానం నడిపాక దాన్నే జీవనోపాధిగా చేసుకోవాలని నిర్ణయించుకుందట. 2019లో మిల్ టన్ డేవిస్, లెట్ లైటస్ అనే అధికారులు యునైటెడ్ యూత్ ఏవియేటర్స్ ప్రారంభించారు.

ఇందులో శిక్షకులుగా 13 నుంచి 18 ఏళ్ల వారికి అవకాశం ఇచ్చారు. విమానం నడిపేందుకు లైసెన్స్ మాత్రం 16 ఏళ్లు నిండినవారికే ఇచ్చారు. అలా కమోరా 12 ఏళ్ల వయసులోనే పాఠాలు నేర్చుకుంది. యూనైట్ యూత్ ఏవియేషన్ అధికారులు మాత్రం ఆమెకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడే విమానం నడిపేందుకు అంగీకరించింది. విమానం నడిపేందుకు కావాల్సిన పరిస్థితులను అవగాహన చేసుకుంది.

కమోరా చిన్న వయసులోనే పైలట్ గా అవతారమెత్తి రికార్డు సాధించింది. పిన్న వయసులోనే పైలట్ ఘనత సాధించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే పైలట్ గా అయి రికార్డులు కొల్లగొట్టింది. రెండు గంటల సోలో పైలట్ గా గుర్తింపు పొందింది. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమనే విషయాన్ని రుజువు చేసింది.