Begin typing your search above and press return to search.

వైభవ్ ఏకంగా 35 బంతుల్లోనే సెంచరీ.. సీబీఎస్ఈ టెన్త్ ఫెయిల్.. అసలు సంగతి ఏమిటి?

ఇంకా శరీరం లేతగానే ఉంది.. బంతి తగిలితే ఎక్కడ కందిపోతాడో అనేలా ఉన్నాడు.. అలాంటి అత్యంత పోటీ ఉండే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఎంపికయ్యాడు..

By:  Tupaki Desk   |   16 May 2025 3:00 AM IST
వైభవ్ ఏకంగా 35 బంతుల్లోనే సెంచరీ.. సీబీఎస్ఈ టెన్త్ ఫెయిల్.. అసలు సంగతి ఏమిటి?
X

ఇంకా శరీరం లేతగానే ఉంది.. బంతి తగిలితే ఎక్కడ కందిపోతాడో అనేలా ఉన్నాడు.. అలాంటి అత్యంత పోటీ ఉండే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఎంపికయ్యాడు..

ఇంకా స్కూల్ కు వెళ్తున్నవాడు.. బ్యాగ్ భుజాన వేసుకుని పాఠశాలకు వెళ్లేవాడు.. ఇప్పుడిప్పుడే కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యేవాడు.. ఐపీఎల్ లో ఏకంగా రూ.1.10 కోట్లకు ధర పలికాడు..

ఇటీవలి ఐపీఎల్ మ్యాచ్ లను చూసినవారికి ఇందతా పిల్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే అని చెప్పాల్సిన పనిలేదు. మెగా వేలంలో రూ.1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కు ఎంపికైన వైభవ్ కు మ్యాచ్ చాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, ఓపెనర్ కెప్టెన్ సంజూశాంసన్ గాయపడడంతో వైభవ్ కు తుది జట్టులో చాన్స్ దొరికింది. దానిని సద్వినియోగం చేసుకున్న అతడు ఏకంగా 14 ఏళ్ల వయసులోనే సెంచరీ కొట్టేసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

గత నెల 28న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ ఏకంగా 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేసి ఔరా అనిపించాడు. అతడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయింది.

’క్రికెట్ అందరి లెక్కలు సరిచేస్తుంది’

ఈ మాట వైభవ్ కు సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకంటే సెంచరీ చేసిన తర్వాతి మ్యాచ్ లోనే అతడు డకౌట్ అయ్యాడు. మరుసటి మ్యాచ్ లో కేవలం 4 పరుగులే చేశాడు. దీంతో దిగ్గజం సునీల్ గావస్కర్ చెప్పినట్లు క్రికెట్ ఎంత అనిశ్చిత గేమ్ అనేది తెలుస్తోంది.

తాజాగా వైభవ్ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అతడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనేది ఈ వార్త. ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు వచ్చాయి. అందులో వైభవ్ ఉత్తీర్ణుడు కాలేదనేది ఆ వార్త ల సారాంశం. ఈ మేరకు అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

దీంతో అటువైపు నుంచి స్పందన వచ్చింది. అసలు వైభవ్ టెన్త్ పరీక్షలే రాయలేదని.. అతడు చదివేది 9వ తరగతేనని క్లారిటీ ఇచ్చారు. బిహార్ కు చెందిన వైభవ్ ప్రస్తుతం 14 సంవత్సరాల 9 రోజుల వయసు వాడు. అంటే ఇంకా టెన్త్ క్లాస్ వయసుకు రాలేదు. సహజంగా మన దేశంలో పిల్లలు టెన్త్ అంటే 15-16 ఏళ్లు ఉంటాయి.

ఈ లెక్కన చూసినా వైభవ్.. ఇంకా టెన్త్ వయసుకు రాలేదని స్పష్టం అవుతోంది.

కాగా, గత సీజన్ లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మాత్రం ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఔట్ అయింది. 12 మ్యాచ్ లకు గాను మూడు మాత్రమే గెలిచింది. కొన్ని మ్యాచ్ లను సరిగా ముగించలేక గెలుపునకు దూరమైంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సిన ఆ జట్టులో వైభవ్ ఎలా రాణిస్తాడో చూడాలి.