Begin typing your search above and press return to search.

న‌డిరోడ్డుపై రీల్స్‌.. ఆమెకు భారీ షాక్ త‌గిలింది!

యూట్యూబ్ రీల్స్ కోసం.. కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్నాయి. యువ‌కులు రైళ్ల ముందు నిలబ‌డి రీల్స్ చేయ‌డం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 12:05 PM GMT
న‌డిరోడ్డుపై రీల్స్‌.. ఆమెకు భారీ షాక్ త‌గిలింది!
X

యూట్యూబ్ రీల్స్ కోసం.. కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్నాయి. యువ‌కులు రైళ్ల ముందు నిలబ‌డి రీల్స్ చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారు ప్ర‌మాదాల బారిన ప‌డి ప్రాణాలు పోగొట్టుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ మ‌హిళ న‌డిరోడ్డుపై రీల్స్ చేస్తుండగా.. ఆమెకు భారీ షాక్ త‌గిలింది. చైన్ స్నాచ‌ర్‌.. ఆమె స‌మీపానికి వ‌చ్చి.. మెడ‌లో ఉన్న ప‌సిడి హారాన్ని తెంచుకుపోయాడు. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. రీల్స్ మోజులోప‌డిన ఆ మ‌హిళ‌.. త‌న మెడలో హారాన్ని స్నాచ‌ర్ తెంపేసిన విష‌యాన్ని 5 నిమిషాల వ‌ర‌కు గ‌మ‌నించ‌లేక పోవ‌డం.

ఎక్క‌డ జ‌రిగింది?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న‌ ఇంద్రాపూర్‌కు చెందిన సుష్మ యూట్యూబ‌ర్‌. తాను త‌ర‌చుగా రీల్స్‌, వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తుంది. ఇలానే.. తాజాగా ఇంటి సమీపంలోని సర్వీస్ రోడ్డులో రీల్స్ చేస్తోంది. అందులో భాగంగా కెమెరావైపు చూస్తూ.. తాను ఏదో మాట్లాడుతూ.. నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని గొలుసును లాక్కుపోయాడు. అతడు గొలుసు లాక్కెళ్తుంటే ఆమె గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆమె గుర్తించి.. అరిచే స‌రికి స‌ద‌రు వ్య‌క్తి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. రీల్ షూట్ చేస్తున్న వ్యక్తి కూడా దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతిచోటా జరుగుతున్నాయని కొందరు కామెంట్ చేస్తే, రీల్స్ మోజులో పడి విలువైన వస్తువు పోగొట్టుకుందని మరొకరు వ్యాఖ్యానించారు. బైక్ నంబరు కనిపిస్తోంది కాబట్టి గొలుసు దొంగను పట్టుకోవడం పోలీసులకు పెద్ద పనేమీ కాదని మరికొం దరు పేర్కొన్నారు. అయితే.. మెజారిటీ నెటిజ‌న్లు మాత్రం దూల తీరిపోయింద‌ని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.