యోగీ మార్క్ ట్రీట్‌మెంట్.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని షూట్..
కేవలం ఒక దేశమే కాదు.. ప్రపంచం మొత్తం కీర్తించే వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
By: Tupaki Desk | 5 Aug 2025 12:16 PM ISTకేవలం ఒక దేశమే కాదు.. ప్రపంచం మొత్తం కీర్తించే వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సన్యాసి అయిన ఆయన తన కుటుంబం, అక్కా, అన్న లాంటి బంధాలను పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర ప్రజల కోసమే పని చేస్తున్న గొప్ప దర్శనికుడు. అతి చిన్న వయస్సులో సన్యాసాశ్రమం తీసుకున్న యోగీ అదే వయస్సులో రాజకీయల్లోకి కూడా వచ్చాడు. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడు పడవోయ్ అన్న గురజాడవారి వ్యాఖ్యలకు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నాడు. యోగీ సొంత లాభం కొంత కాదు.. స్వలాభం ఏమాత్రం పట్టించుకోరు.
యూపీలో ఒక్క గ్యాంగ్ కూడా లేదు..
దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రాన్ని పాలించాలంటే ఆశామాషీ కాదు. దేశంలోనే ఎక్కువ గ్యాంగులు ఉన్న రాష్ట్రం కూడా యూపీ. యోగీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిస్థితులు పోయాయి. చేసిన తప్పులు ఒప్పుకొని లొంగిపోవాలని, లేదంటే దేవుడి దగ్గర వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఇప్పుడు యూపీలో ఒక్క గ్యాంగ్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ధర్మంను పక్కాగా ఆచరిస్తూ పరమత సహనాన్ని వహిస్తుంది యోగీ ప్రభుత్వం. హిందూ వాది యోగి అని ముద్ర పడినా యూపీలో అన్ని మతస్తులు ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. గోవులను సైతం రక్షించి పాడి పంటను ఊహించని విధంగా డెవలప్ చేస్తున్నారు యోగీ.
మహిళల విషయంలో సీరియస్..
గత పాలనలో యువతులపై దాడులు విపరీతంగా పెరిగేవి. సీరియస్ యాక్షన్ తీసుకునేవారు లేక వారి ఆగడాలు పెరిగిపోయాయి. వీటిని గుర్తించిన యోగీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. వర్గం ఏదైనా ఆడవారి జోలికి వెళ్తే.. కఠినంగా వ్యవహరించాలని చెప్పుకచ్చింది. దీంతో పోకిరీలు మహిళలతో జాగ్రత్తగా నడుచుకుంటున్నారు.
ప్రైవేట్ పార్ట్స్ తాకినందుకు షూట్..
ఇటీవల జరిగిన ఘటన యోగీ ప్రభుత్వంలో మహిళలకు ఉండే భద్రత గురించి వివరిస్తుంది. మొరాదాబాద్ లో ఒక ముస్లిం స్త్రీ బుర్ఖా ధరించి రోడ్డుపై వెళ్లుంది. అయితే వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఒక వ్యక్తి ఆమె విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. వెనుక నుంచి గట్టిగా పట్టుకొని పారిపోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగి షాక్ అయ్యింది. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో చూసిన పోలీసులు సదరు వ్యక్తికోసం గాలించారు. అతను ఆదిల్ గా గుర్తించారు. పారిపోతుండగా పట్టుకునేందకు ప్రయత్నించిన పోలీసులను ఇల్లీగల్ వెపన్ తో బెదిరించేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతని కాలిపై కాల్చారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించారు. ముస్లిం యువతికి హాస్పిటల్ కు తీసుకువచ్చి క్షమాపణలు చెప్పించారు. యోగీ మార్క్ పాలన అంటే స్త్రీ పట్ల ఎంత గౌరవం ఉంటుందో ఈ ఒక్క సంఘటన తెలిస్తే అర్థం అవుతుంది.
