ఫ్రేమ్ ఆఫ్ ది డే'... చంద్రబాబు వెనుక లోకేష్, పవన్ అడుగులో అడుగు!
ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్ లో బాబు, లోకేష్, పవన్ లు కనిపించిన వీడియో వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 21 Jun 2025 11:17 AM ISTవిశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి సందడిగా మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న వేళ.. యోగాసనాలు వేసేందుకు సాగరతీరానికి లక్షలాది మంది తరలివచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అవును... విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందడి సందడిగా మొదలైంది. ఈ రోజు వేకువజాము నుంచే సాగర పరిసరాల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా... ఏయూ మైదానంతో పాటు గోల్ఫ్ క్లబ్, పోర్టు స్టేడియం, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం, రైల్వే ఎగ్జిబిషన్ మైదానం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం సహా 18 క్రీడా మైదానాల్లో యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్ లో బాబు, లోకేష్, పవన్ లు కనిపించిన వీడియో వైరల్ గా మారింది. యోగాసనాలు వేసేందుకు వస్తున్న సమయంలో పెద్దగా, ముందుగా చంద్రబాబు నడుస్తుంటే.. ఆయన వెనుక నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఫాలో అయ్యారు. దీనికీ సంబంధించిన విజువల్ ఆసక్తికరంగా మారింది. నెట్టింట వైరల్ అవుతోంది.
ఏపీలో కూటమి పెద్దగా, ప్రభుత్వ పెద్దగా సీఎం చంద్రబాబు ముందు నడుస్తుంటే... ఆయన అడుగుజాడల్లో, ఆయన క్రమశిక్షణలో ఆయన వెనుక అన్ని విషయాల్లో తాము వెనక నడుస్తామన్నట్లుగా మంత్రులు లోకేష్, పవన్ అడుగులో అడుగువేస్తున్నట్లుగా ఆ విజువల్ ఉందని అంటున్నారు. ఈ ఫార్ములా, ఈ త్రయం ఎప్పుడూ ఉండాలని కోరుతున్నారు.
మరోవైపు... ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర-2025' కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా నిర్వహించిన ఈ యోగా ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం ప్రతిష్ట మరింత పెరిగింది.
