Begin typing your search above and press return to search.

వైసీపీ వ్య‌తిరేక ఓటు చీలడం ప‌క్కా... ఫ్రూప్స్ ఇవే...!

ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ.. జై భీం రావ్ పార్టీ, బీఎస్పీ వంటివి దూకుడు గానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 Dec 2023 3:30 PM GMT
వైసీపీ వ్య‌తిరేక ఓటు చీలడం ప‌క్కా... ఫ్రూప్స్ ఇవే...!
X

ఏపీ లోని వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను చీలకుండా చూస్తామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ స‌ర్కాను గ‌ద్దె దింపుతామ‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మం లో ఆయ‌న మాటల నాయ‌కుడిగానే మిగిలి పోతున్నారు త‌ప్ప క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ని.. పార్టీల‌ను అంచ నా వేయ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. రాష్ట్రంలో వైసీపీ,టీడీపీ,జ‌న‌సేన‌,బీజేపీలే కాదు.. అనేక చిన్న చిత‌కా పార్టీలూ కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ.. జై భీం రావ్ పార్టీ, బీఎస్పీ వంటివి దూకుడు గానే ఉన్నాయి. పైకి ఇవి ప్ర‌త్య‌క్షంగా కార్యాచ‌ర‌ణ‌లు చేయ‌క‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో ఎస్సీల ప‌ట్టు తెలుసుకుని..వారిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. దీం తో క‌నీసంలో క‌నీసం.. 1 శాతం ఓటు బ్యాంకు అయినా.. చీలి పోతుంది. అది కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటేన‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌,ఆప్ స‌హా.. రాయ‌ల‌సీమ పోరాట స‌మితి,ఉత్త‌రాంధ్ర పోరాట స‌మితి పార్టీలు కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నాయి. దీం తో ఇవి కూడా ఆయా ప్రాంతాల్లో ఓట్ల‌ను 0.5 నుంచి 1 శాతం ఓట్లు చీల్చినా.. అది జ‌న‌సేన అధినేత భావిస్తున్న ఓట్ల చీలకుండా చూస్తాన‌న్న మంత్రానికి విరుగుడుగానే ప‌నిచేయ‌నుంది.ఇక‌,కాపు సామాజిక వ‌ర్గానికి వ‌స్తే.. జేడీ పెట్టిన కొత్త పార్టీప్ర‌భావం అంతో ఇంతో ఉంటుంద‌ని అంటున్నారు.

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ కూడా మేధావి వ‌ర్గం ఓట్ల‌ను చీలుస్తుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.ఇవ‌న్నీ ఇలా ఉంటే..క‌మ్యూనిస్టుల ఓట్లు కూడా కీల‌కంగా మారుతున్నాయి. ఈ పార్టీలు ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తుల విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. బీజేపీ క‌ల‌వ‌క‌పోతే.. టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తుకు.. సీపీఐ సిద్ధంగా ఉంది. కానీ పీసీఎం మాత్రం ఒంట‌రిపోరుకే రెడీ అవుతోంది. ఇది ఒక వ్యూహంలో భాగ‌మ‌నేన‌న్న‌ది తెలిసిందే. ఇక‌,కాపు సామాజిక వ‌ర్గంమేధావులు కూడా సైలెంట్‌గా ఉన్నారు.

వీరు కూడా ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చే పిలుపు ఓట్ల‌ను చీల్చ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వస్తున్నాయి. మ‌రో వైపు.. తెలంగాణ మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ క‌నుక స‌రిహ‌ద్దు నియోజ‌క‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తే.. అప్పుడు మ‌రింత‌గా ఓట్లు చీలుతాయ‌ని చెబుతున్నారు.సో.. ఎలాచూసుకున్నా..వైసీపీ వ్య‌తిరేక ఓటు చీలుతుంద‌నేది మెజారిటీ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.