ఆ ఫార్టీ పర్సెంట్ ఓట్లలో వైసీపీకి ఎన్ని...?
మరి ఆ సామాజికవర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా
By: Tupaki Desk | 27 July 2023 10:30 AM ISTఏపీ లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం లోకి రావడానికి అన్నికుల్లాలు దోహదం చేశాయి. పర్సెంటేజ్ కాస్తా అటూ ఇటూ అయినా అందరూ ఓట్లేశారు. ఒక విధంగా సర్వ జనామోదంతోనే 151 సీట్లు దక్కి జగన్ విభజన ఏపీ కి రెండవ సీఎం అయ్యారు. అందులో ఏపీ లో కీలకమైన అధికారం లో పోటీ పడే కమ్మ సామాజికవర్గం కూడా 2019 ఎన్నికల్లో వైసీపీ కి ఓట్లేసింది.
అదెలా అంటే మొత్తం కమ్మ వర్గం ఓట్లలో అరవై శాతం టీడీపీ కి పడితే నలభై శాతంగా వైసీపీకి ఓటెత్తారు అని ఒక రఫ్ అంచనా ఉంది. అంటే ఇది నిజంగా రికార్డే అని అంటారు. ఎపుడూ టీడీపీక నూటికి ఎనభై శాతం ఓట్లు వేసే కమ్మ సామాజిక వర్గం 2019 ఎన్నికల్లో ఎందుకో కొన్ని విషయాల్లో డిఫర్ అయి జగన్ వైపు వచ్చింది. అందుకే గుంటూరు కృష్ణా జిల్లాల లో వైసీపీ బ్రహ్మాండంగా గెలిచింది.
క్రిష్ణా జిల్లాలో మొత్తం 15 సీట్లకు గానూ 13 దాకా సీట్లను వైసీపీ గెలుచుకుంది. గన్నవరం, విజయవాడ తూర్పు సీట్లను టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు లో చూస్తే 16 సీట్లు ఉంటే అందు లో రెండు తప్ప అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న సీట్లలోనూ వైసీపీ దూకుడు చేసింది.
కానీ ఇపుడు సీన్ మొత్తం రివర్స్ అవుతుందా అన్న చర్చ ఉంది ఎందుకంటే అమరావతి రాజధాని మీద వైసీపీ విధానం లో మార్పు రావడం. అదే విధంగా కమ్మల విషయం లో ప్రభుత్వ ఉద్దేశ్యాలు ఎవైనా టార్గెట్ టీడీపీ గా వైసీపీ జోరు చేయడంతో ఆ వర్గం కూడా మండిపోతున్నారు అని అంటున్నరు. ఈ ప్రభావం కాస్తా 2024 ఎన్నికల మీద పడనుంది అని అంటున్నారు.
క్రిష్ణా జిల్లాలో అనేక నియోజకవర్గాలలో కమ్మల రాజకీయ ఆధిపత్యం ఉంటుంది. ఆ సీట్లలో ఈసారి వైసీపీ కి దెబ్బ పడుతుందా అన్న చర్చ మొదలైంది. గన్నవరం, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలేరు. గుడివాడ వంటి చోట్ల కమ్మలు వైసీపీకి యాంటీ గా చేస్తారా అన్నది చూడాలని అంటున్నారు.
అదే విధంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే తాటికొండ ఎస్టీ నియోజకవర్గం అయినా అమరావతి పరిధి లో ఉంది. ఇక్కడ కమ్మల స్టాండ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరం. మంగళగిరి లో కూడా టఫ్ ఫైట్ ఈసారి ఉంటుందని అంటున్నారు. అలాగే తెనాలి, చిలకలూరిపేట, వినుకొండ, మాచెర్ల వంటి చోట్ల కూడా కమ్మ ఫ్యాక్టర్ ఏమైనా చేస్తుందా అన్న చర్చ అయితే ఉందిట.
మొత్తం మీద చూస్తే గతసారి ఫార్టీ పర్సెంట్ ఓట్లు కమ్మ సామాజికవర్గం నుంచి వైసీపీ కి షిఫ్ట్ అయ్యాయి. ఈసారి ఆ పర్సెంటేజ్ ఎంత తగ్గుతుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. మరి ఆ సామాజికవర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా ఎన్నికల కు దగ్గర చేసి సామాజికవర్గాలతో సామరస్యం చేసే ప్రయత్నం ఉందా అన్నది చూడాలని అంటున్నారు.
