Begin typing your search above and press return to search.

పవన్ ట్రాప్ లో వైసీపీ...!

వైసీపీ పవన్ ని టార్గెట్ చేసుకోవడంలోనే వ్యూహాత్మక తప్పిదం ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 March 2024 12:30 AM GMT
పవన్ ట్రాప్ లో వైసీపీ...!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని ముగ్గులోకి లాగారు. ఆయనకు వైసీపీ వీక్ నెస్ బాగా తెలుసు. జగన్ ని అంటే ఆ పార్టీ నేతలు వరసబెట్టి మీడియా ముందుకు వచ్చి తనను విమర్శిస్తారని విరుచుకుపడతారని. ఆ విధంగా వారు బిగ్ సౌండ్ చేస్తూంటే అది తనకు సింపతీగా మారుతుందని కూడా తెలుసు.

నిజానికి 2019 తరువాత పవన్ ని ఒక బలమైన సామాజిక వర్గానికి బాగా దగ్గర చేయడంతో పాటు ఒక భారీ నంబర్ తో ఉన్న యువతను దూరం చేసుకుంది కూడా వైసీపీయే అని అంటారు. వైసీపీ పవన్ ని టార్గెట్ చేసుకోవడంలోనే వ్యూహాత్మక తప్పిదం ఉంది అని అంటున్నారు.

పవన్ కి సినీ హీరోగా విశేషమైన అభిమాన గణం ఉంది. అదే విధంగా ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో పవన్ ప్రతీ అడుగునూ వారు ఘనంగా స్వాగతించి తమ గుండెలలో పెట్టుకుంటారు. ఈ సంగతి గమనించకుండా పవన్ రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారని విమర్శిస్తూ పలుచన చేయడానికి వైసీపీ చూసింది.

ఆఖరుకు సీఎం స్థాయి నుంచి కూడా విమర్శలు పదునుగా వచ్చిపడేవి. అయితే పవన్ వాటిని అంతే ధీటుగా తిప్పికొట్టడమే కాదు వైసీపీని వీలైనప్పుడల్లా ముగ్గులోకి లాగుతూ ఉండేవారు. చివరికి వైసీపీ మీద ఒక సామాజిక వర్గం యువతలో వ్యతిరేకతను కలిగించడంతో పాటు అదే పవన్ కి జనసేనకు శ్రీరామ రక్ష అయింది.

దీంతో ఇపుడు సరిగ్గా ఎన్నికల వేళ మరోమారు అదే అస్త్రాన్ని పవన్ ప్రయోగించారు. ఈసారి ఎన్నడూ వాడని మాటలతో గట్టిగానే విమర్శలు చేశారు. జగన్ మీద పవన్ చేసిన విమర్శలకు ఒక రోజు అంతా వైసీపీ నుంచి రిటార్టులు కౌంటర్లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. దాంతో అది జనసేనకే మేలు జరిగేలా మారింది.

ఇప్పటిదాకా జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చారు అన్న ఆందోళనతో ఉన్న వారు అంతా ఇపుడు పవన్ వైపు మొగ్గారు. వారిని ఆ విధంగా తన వైపు తిప్పుకోవడంతో జగన్ మంత్రాన్నే పవన్ ప్రయోగించారు అని అంటున్నారు.

పవన్ సినీ డైలాగులు వల్లించారా లేక తీవ్ర ఆవేశం చూపించారా అన్నది ఇక్కడ మ్యాటర్ కానే కాదు. పవన్ సినీ హీరో కం పొలిటీషియన్ గా ఉండడంతో ఆయన నుంచి రావల్సిన దాని కన్నా ఎక్కువ డోస్ తాడేపల్లిగూడెం సభలో జనసైనికులకు దక్కింది. అంతే కాదు జగన్ మీద చేసిన తీవ్ర విమర్శలకువ్ వారంతా పూర్తిగా జోష్ లో మునిగారు.

ఈ పరిణామంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న జనసేనలోని అసంతృప్తి అంతా పాలపొంగులా చప్పున చల్లారడానికి దోహదపడింది. మొత్తం మీద జనసేనకు హెల్ప్ కలిగేలా క్యాడర్ మొత్తం ఒక వైపు వచ్చేలా చేసుకోవడంలో పవన్ మార్క్ వ్యూహం సక్సెస్ అయింది అని అంటున్నారు. అలా పవన్ ట్రాప్ లో వైసీపీ చిక్కుకుంది అని అంటున్నారు.