Begin typing your search above and press return to search.

మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరికి వైసీపీ టికెట్....!?

ఆమె పనితీరు పట్ల అధినాయకత్వానికి వచ్చిన సర్వే నివేదికలు అంత సంతృప్తికరంగా లేవుట.

By:  Tupaki Desk   |   20 Dec 2023 3:56 AM GMT
మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరికి వైసీపీ టికెట్....!?
X

వైసీపీ టికెట్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి సోదరికి ఇస్తున్నారా అంటే అవును అంటున్నారు. మరి మాజీ ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు ఉత్తరాంధ్రాలోని పార్వతీపురం మన్యం జిల్లాలో. అతి చిన్న జిల్లా ఇది. ఇందులో మూడు ఎస్టీ సీట్లు ఒక ఎస్సీ సీటు ఉన్నాయి.

ఇక ఎస్టీ సీట్లలో పాలకొండ, సాలూరు, కురుపాం ఉన్నారు. కురుపాం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఎమ్మెల్యేగా రెండవసారి కొనసాగుతున్నారు. ఆమె పనితీరు పట్ల అధినాయకత్వానికి వచ్చిన సర్వే నివేదికలు అంత సంతృప్తికరంగా లేవుట.

దాంతో కురుపాం లో కొత్త ముఖానికి చాన్స్ ఇస్తారు అని అంటున్నారు. అదే టైం లో పాముల పుష్ప శ్రీవాణి సోదరికి పాలకొండ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ ఫ్యామిలీకి కొంత న్యాయం చేస్తారు అని టాక్ నడుస్తోంది.

మరి పాలకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి అంటే ఆమెకు ఆమె పోటీ నుంచి తప్పుకుంటారు అని అంటున్నారు. 2014, 2019లలో రెండు సార్లు పాలకొండ నుంచి గెలిచిన విశ్వసరాయి కళావతి ఇపుడు పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. దానికి కారణం ఆమెకు ఉన్న వ్యక్తిగత కారణాలతో పాటు, పనితీరు పట్ల వచ్చిన వ్యతిరేక సర్వేలు అంటున్నారు. అలాగే ఆర్ధికంగా కూడా ఆమె బలంగా లేరు అని అంటున్నారు.

మంత్రి పదవి విషయంలో ఆమె ఆశ పెట్టుకున్నా దక్కలేదు. దాంతో అమె నిరాశకు గురి అయ్యారు. ఇక ఆమె జోరు తగ్గించేశారు అని అంటున్నారు. ఫలితంగా పాలకొండలో వైసీపీ కూడా జోరు తగ్గింది అని అంటున్నారు. దాంతో అక్కడ కొత్త క్యాండిడేట్ వేటలో వైసీపీ ఉంది అని అంటున్నారు.

అలా చూసుకుంటేనే పుష్ప శ్రీవాణి సోదరిని ముందుకు తీసుకుని వస్తారు అని ప్రచారం జరుగుతోంది. ఈసారికి శ్రీవాణిని పక్కన పెట్టి ఆమె సోదరికి టికెట్ ఇవ్వడం ద్వారా పాలకొండ కురుపాం లలో మళ్లీ గెలవాలని వైసీపీ హై కమాండ్ చూస్తోందిట.

దీనికి పుష్ప శ్రీవాణి ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నది చూడాలి. ఇక పాలకొండలో టీడీపీ ఇటీవల కొంత పుంజుకుంటోంది అని అంటున్నారు. దాంతో వైసీపీ రెండు సార్లు గెలిచిన సీటుని కాపాడుకోవడమే కాకుండా హ్యాట్రిక్ కొట్టడానికి కొత్త ముఖాన్ని తీసుకుని రావాలని అనుకుంటోందిట.