Begin typing your search above and press return to search.

వైసీపీ, టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై అప్ డేట్స్ ఇవే!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఫైనల్ జాబితాలను సిద్ధం చేసుకుని, విడుదల చేయాలని అధికార పార్టీ రెడీ అయ్యిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   13 March 2024 10:34 AM GMT
వైసీపీ, టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై  అప్  డేట్స్  ఇవే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితా వెలువడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కార్యకర్తల "సిద్ధం" సభలు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 18 నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలవుతాయని అంటున్నారు. దీంతో... అభ్యర్థుల ప్రకటన వివరాలు, మేనిఫెస్టో ప్రకటన మొదలైన వివరాలు వెరపైకి వస్తోన్నాయి. ఇదే సమయంలో టీడీపీ కూడా రెండో విడత అభ్యర్థుల ప్రకటించాల్సి ఉంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఫైనల్ జాబితాలను సిద్ధం చేసుకుని, విడుదల చేయాలని అధికార పార్టీ రెడీ అయ్యిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఇడుపులపాయ లోని వైఎస్సార్ ఘాట్ వేదికగా.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారని తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థులను ప్రకటించారు.

ఇప్పటివరకూ విడతల వారీగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులతో కలిపి 77 అసెంబ్లీ స్థానాలను, 23 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది వైసీపీ. ఈ క్రమంలో ఒకటి రెండు రోజుల్లో ఈ ఫైనల్ జాబితాను సిద్ధం చేసి ఈ నెల 16న ఇడుపులపాయలో జగన్ స్వయంగా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇక ఆ ప్రకటన అనంతరం జగన్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచార కార్యక్రమాల షెడ్యూల్ విడుదలవ్వొచ్చని అంటున్నారు.

14న టీడీపీ రెండో జాబితా!:

మరోపక్క ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో చంద్రబాబు తొలివిడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 14 - గురువారం టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని.. వారి వారి అవకాశాలను బట్టి అభ్యర్థులను ప్రకటించుకుంటారని అన్నారు!

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిలో భాగంగా... 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిగిలిన వాటిలో 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు.. 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో వరుసగా జనసేన, బీజేపీలు పోటీ చేయబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ 94మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో.. ఇంకా సుమారు 50 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది!