Begin typing your search above and press return to search.

అర్బన్ లో టీడీపీని దెబ్బ కొట్టే ప్లాన్ లో వైసీపీ...?

ఎన్టీయార్ పార్టీని పెట్టినపుడు అంటే 1983లో అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా అంతా జై కొట్టారు.

By:  Tupaki Desk   |   24 Sept 2023 3:42 AM
అర్బన్ లో టీడీపీని దెబ్బ కొట్టే ప్లాన్ లో వైసీపీ...?
X

ఎన్టీయార్ పార్టీని పెట్టినపుడు అంటే 1983లో అర్బన్ రూరల్ అన్న తేడా లేకుండా అంతా జై కొట్టారు. అలా అద్భుతమైన మెజారిటీతో ఆయన అధికారంలోకి 1983, 1985లలో వచ్చారు. అయిఎతే 1989 నాటికి టీడీపీ ఓడిపోయింది. ఎన్టీయార్ స్వయంగా కల్వకుర్తిలో ఓటమి చవిచూశారు.

ఆ ఎన్నికల్లో అర్బన్ ఓటర్లు ఫస్ట్ టైం టీడీపీకి దూరం జరిగారు. అందులో ఉద్యోగులు విద్యావంతులు, మేధావులు, ఇలా పలు సెక్షన్లు ఉన్నాయి. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బంపర్ విక్టరీని కొట్టినా కూడా అర్బన్ ఓటర్లను 1983 స్థాయిలో దగ్గరకు చేరువ చేసుకోలేకపోయింది.

అదే టైం లో కాంగ్రెస్ వైపు గట్టిగా అర్బన్ ఓటర్లు నిలబడ్డారు. వారంతా ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తూ వచ్చారు. దాంతోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బాగా నిలబడింది. ఇక జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు టీడీపీ గెలుచుకుంటే మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు కాంగ్రెస్ గెలుచుకున్న సందర్భం కూడా 1987 నాటికే జరిగింది.

ఇక 1995 నాటికి చూస్తే చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన తరువాత తన మామ బాటలో నడవలేదు, ఐటీ అన్నారు, సంస్కరణలు అన్నారు, కార్పోరేట్ స్టైల్ అన్నారు. గ్లోబలైజేషన్ అంటూ ఆ విధానాలను వల్లె వేశారు. ఫలితంగా అర్బన్ ఓటర్లు టీడీపీ వైపు టర్న్ అయ్యారు.

ఐటీ సాఫ్ట్ వేర్ రంగాలలో చేరే వారిలో ఎక్కువగా అర్బన్ వారే ఉండడంతో బాబు అంటే విజనరీ అన్న భావన ఏర్పడింది. అలా అర్బన్ సెక్షన్లు టీడీపీకి గట్టి సపోర్ట్ గా నిలిచాయి. అదే టైం లో రూరల్ సెక్షన్లు ఎన్టీయార్

హయాంలో పెట్టని కోటగా టీడీపీ లో ఉంటే బాబు దాకా వచ్చేసరికి వారు దూరం అయ్యారు. బాబు సంస్కరణల ప్రభావం అలా వారి మీద పడింది అనుకోవాలి. వ్యవసాయం దండుగ అని బాబు అన్నారని అప్పట్లో జరిగిన ప్రచారం కూడా పూర్తిగా టీడీపీకి దూరం చేసింది.

ఇక వైఎస్సార్ చేసిన పాదయాత్ర రూరల్ బెల్ట్ ని కంప్లీట్ గా కాంగ్రెస్ కి చేరువ చేసింది. అది రెండు దఫాలు ఆ పార్టీని అధికారంలో కూర్చోబెట్టింది. ఇక 2014 నాటికి చూస్తే విభజన జరిగిన తరువాత ఏపీలో అర్బం ఓటర్లు గంపగుత్తగా టీడీపీకి జై కొట్టారు. అదే టైంలో వైసీపీకి రూరల్ సెక్టార్ అండగా నిలబడింది. అయితే బీజేపీ జనసేన పొత్తు వల్ల రూరల్ లో టీడీపీ తన సత్తా కొంత వరకూ చాటడంతో ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది

ఇక 2019 నాటికి వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడానికి రూరల్ బెల్ట్ ఫుల్ గా కోపరేట్ చేసింది. సెమీ అర్బన్ కూడా వైసీపీకి జై కొట్టింది. దాంతో ఓన్లీ అర్బన్ ఓటింగే టీడీపీని కాపాడింది. అందువల్ల ఓటు షేర్ దాదాపుగా నలభై దాకా వచ్చింది. సీట్లు మాత్రం ఓట్ల చీలికలో పెద్ద ఎత్తున కోల్పోయింది.

ఇపుడు కూడా చూస్తే అర్బన్ సెమీ అర్బన్ టీడీపీకి అండగా నిలబడుతోంది. అందుకే ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు విజయం సాధించారు. ఇక రూరల్ సెక్టార్ లో అయితే తేడా లేకుండా వైసీపీకి ఈ రోజుకీ గట్టి బేస్ ఉంది. అయితే సెమీ అర్బన్ ఓటర్లలో మాత్రం చేంజ్ కనిపిసోంది.

దాంతోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తులతో పుంజుకుని ముందుకు రావాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో వైసీపీ అర్బన్ సెక్టార్ మీద ఫోకస్ పెట్టింది.అక్కడ తన వంతు వాటా ఓట్ల షేర్ ని పెంచుకోవడంతో పాటు టీడీపీని తగ్గించాలని చూస్తోంది

కానీ అర్బన్ ఓటర్లలో బాబు మీద ఒక గుడ్ ఇమేజ్ ఉంది. ఆయన విజనరీ అన్న భావన ఉన్నత మధ్యతరగతి వర్గాలలో ఉంది. ఇపుడు ఆ భావనను చెదిరిపోయేలా స్కిల్ స్కాం బయటకు వచ్చింది. మొదట్లో ఈ కేసు అక్రమంగా పెట్టినది అని అనుకున్నా కోర్టు తీర్పులు కూడా బాబుకు వ్యతిరేకంగా రావడం రిమాండ్ కి తరలించడంతో కొంత కదలిక అయితే అర్బన్ సెక్షన్ లో వస్తుంది అని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో మరింత గట్టిగా బాబు అవినీతి చేశారు అని ప్రచారం చేయడం ద్వారా టీడీపీని దెబ్బ తీయాలన్న వ్యూహాన్ని వైసీపీ అమలు చేయనుంది అంటున్నారు. చూడాలి మరి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో.