Begin typing your search above and press return to search.

వైసీపీకి పడే ప్రతీ ఓటుకూ లెక్క ఉందట ?

అవన్నీ ఈవీఎంలలో పడేలా వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకుందని పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ ఈసారి కొత్త పోకడలు పోయిందని అది కూడా ఆ పార్టీకి అసెట్ అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 3:35 AM GMT
వైసీపీకి పడే ప్రతీ ఓటుకూ లెక్క ఉందట ?
X

కోట్ల మంది ఓటర్లు, పైగా వివిధ వర్గాలు వర్ణాలు. ఈ లెక్కలు ఎలా కుదురుతాయి అని అంటే చేయాలే కానీ రాజకీయ గణితంలోనూ డిస్టిక్షన్ లో పాస్ కావచ్చు అన్నది వైసీపీ థియరీ. ఆ పార్టీ 2019లో అనుసరించిన వ్యూహాలతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అపుడు వైసీపీ విపక్షంలో ఉంది.

దాని కంటే ముందు 2014లో వైసీపీ కేవలం ప్రచారాన్ని నమ్ముకుని పనిచేస్తే 67 సీట్లు దక్కాయి. ఆనాడు ఎలక్షనీరింగ్ లో వైసీపీ తడబడింది. టీడీపీ అందులో మార్కులు కొట్టేసి దూసుకుని పోయింది. దాంతో లోపం ఎక్కడ ఉందో తెలుసుకుని టీడీపీని వెనక్కి నెట్టి ఎలక్షనీరింగ్ చేసిన తొలి ఎన్నిక 2019 అయితే మలి ఎన్నికగా 2024 నిలవబోతోంది అని అంటున్నారు.

వైసీపీ తమకు పడాల్సిన ఓట్లు అన్నీ సేఫ్ గా పోలింగ్ బూత్ లకు తెచ్చుకుందని అంటున్నారు. అవన్నీ ఈవీఎంలలో పడేలా వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకుందని పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ ఈసారి కొత్త పోకడలు పోయిందని అది కూడా ఆ పార్టీకి అసెట్ అని అంటున్నారు.

వైసీపీకి వాలంటీర్ల వ్యవస్థ ఉంది. అలాగే ప్రతీ యాభై కుటుంబాలకు వారితో పాటుగా గృహ సారధులను కూడా పార్టీ తరఫున ఏడాది క్రితమే నియమించింది. వాలంటీర్లను ఎన్నికల సమయంలో పనిచేయనీయరు అన్నది వైసీపీ పెద్దలకు తెలుసు అని అంటున్నారు. అందుకే వారికి తోడుగా వీరిని రంగంలోకి దింపారు.

ఇపుడు వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి కూడా వైసీపీ విజయం కోసం గ్రామాలలో బాగానే వాడుకున్నారు అని అంటున్నారు. అలాగే గృహ సారధులు కూడా వైసీపీకి బాగా అక్కరకు వచ్చారని అంటున్నారు. ఇలా ఈ రెండు వ్యవస్థలను బాగా సక్సెస్ ఫుల్ గా ముగ్గులోకి దింపి మరీ ఫస్ట్ హవర్ నుంచే వైసీపీ తమ ఓట్లను వేయించుకుందని అలా ఈవీఎంలలో వైసీపీకి అనుకూలంగా ఓట్ల పంట పండించుకుందని అంటున్నారు.

రాష్ట్రంలో ఈసారి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంగా ఉంటే పట్టణాలలో అది కాస్తా 62.62గా ఉంది. అదే రూరల్ ఏరియాలలో అయితే 82.32గా ఉంది. వైసీపీ గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్ చేసింది అని అంటున్నారు. అక్కడే పార్టీకి ఫేవర్ గా కూడా ఉండడంతో గెలుపు దిశగా పార్టీని పరుగులు తీయించింది అని అంటున్నారు

ఏపీలో చూస్తే మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో రూరల్ లో ఉన్నవి 117 అర్బన్ లో ఉన్నవి 58 గా ఉన్నాయని ఒక లెక్క ఉంది. అలాగే రూరల్ లోనే భారీ పోలింగ్ సాగడం, మహిళకు వృద్ధులు అంతా పోలింగ్ బూత్ లకు క్యూ కట్టడం వెనక వాలంటీర్లు గృహ సారధులు ఉన్నారని అంటున్నారు. వైసీపీకి ఓటు చేయకపోతే పధకాలు ఏవీ ఉండవని జరిగిన ప్రచారం దానికి వాలంటీర్లు కూడా చేసిన మేలు అన్నీ కలసే వైసీపీకి ఓట్లు పడేలా చేసాయని అంటున్నారు.

ఈ ధీమా బాగా ఉండబట్టే మేమే మళ్లీ అధికారంలోకి వస్తున్నామని వైసీపీ చెప్పగలుగుతోంది అని అంటున్నారు మొత్తం మీద వైసీపీ ఎలక్షనీరింగ్ వర్కౌట్ అయింది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఆ సక్సెస్ రేటు ఎంత నిజంగా ఓట్ల పంట పండిందా లేదా అన్నది తెలియాలంటే రిజల్ట్ డే వరకూ ఆగాల్సిందే మరి.