Begin typing your search above and press return to search.

వైసీపీ లాస్ట్ పంచ్ : అక్కడ సిద్ధం.. మేనిఫెస్టో రిలీజ్...!

ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు అన్నీ రోడ్ షోలు నియోజకవర్గాల సభలు పెట్టుకుంటూ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 March 2024 9:40 AM GMT
వైసీపీ లాస్ట్ పంచ్ : అక్కడ సిద్ధం.. మేనిఫెస్టో రిలీజ్...!
X

లాస్ట్ పంచ్ ఎవరిదైతే వారికి ఉన్న ఆనందం వర్ణనాతీతం. సిద్ధం సభలతో వైసీపీ ఏపీలో సందడి చేస్తోంది. రీజియన్ల వారీగా సిద్ధం సభలను వైసీపీ ఈసారి ప్లాన్ చేసింది. ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు అన్నీ రోడ్ షోలు నియోజకవర్గాల సభలు పెట్టుకుంటూ వస్తున్నాయి.

వైసీపీ పొలిటికల్ గా కొత్త రూట్లో వెళ్తోంది. దీంతో సిద్ధం అంటూ ఏకంగా నాలుగైదు జిల్లాలు కలుపుకుని ఒక పెద్ద భారీ సిద్ధం సభను నిర్వహిస్తోంది. ఇది రీసౌండ్ చేస్తోంది. మొదట ఉత్తరాంధ్రా నుంచి భీమిలీని ఎంచుకుని సిద్ధం సభను నిర్వహించారు. ఆ తరువాత గోదావరి జిల్లాలను కలుపుకుని దెందులూరులో రెండవ సిద్ధం సభ నిర్వహిస్తే అది సూపర్ హిట్ అయింది. ఇక మూడవ సిద్ధం సభను రాప్తాడులో నిర్వహించారు. అది అయితే ఏకంగా పది లక్షల దాకా జనాలు వచ్చారని చెప్పుకున్నారు.

జాతీయ స్థాయిలో కూడా రాప్తాడు సభ చర్చనీయాంశం అయింది. ఈ నేపధ్యంలో సిద్ధం సభల సిరీస్ లో భాగంగా వైసీపీ నాలుగవది చివరిది అయిన సభను గ్రాండియర్ గా నిర్వహించబోతోంది. ఈ సభకు ఏకంగా వంద ఎకరాల సువిశాలమైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నారు. పదిహేను లక్షల మందితో ఈ సభ జరుగుతుందని వైసీపీ చెబుతోంది.

బాపట్ల జిల్లాలోని మేదరమెట్ట వద్ద ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ గురించిన ఆసక్తికరమైన వివరాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోయేది అని ఆయన అభివర్ణించారు. సిద్ధం సభలకు ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా జనాలు పోటెత్తుకున్నారు అని ఆయన గుర్తు చేశారు.

ఇక మేదరమెట్ట సభ అయితే నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా సాగుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అయిదేళ్లలో వైసీపీ ప్రజలకు ఏమి చేసింది అనేది సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ చెబుతారు అని ఆయన వివరించారు. అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి వైసీపీ ఏమి చేసింది అన్నది పూర్తిగా వివరిస్తారు అని ఆయన వెల్లడించారు

ఇదే సభలో వైసీపీ ఎన్నికల ప్రణాళిక కూడా రూపొందిస్తారు అని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం. ఇదిలా ఉంటే వైసీపీ మేనిఫెస్టోలో సంక్షేమం అభివృద్ధి రెండూ ఉంటాయని ఆయన హింట్ ఇచ్చేశారు. ఇప్పటిదాకా వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పధకాలకు రెట్టింపు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుందని అంటున్నారు

ఇక వైసీపీ మేదరమెట్టలో నిర్వహించే సభ అల్టిమేట్ అని చెబుతున్నారు. ఈ సభతో వైసీపీ పూర్తిగా ఎన్నికల గోదాలోకి దిగిపోతుంది అని అంటున్నారు. ఈ సభ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. దాంతో ముఖ్యమంత్రి జగన్ జిల్లాల టూర్లు మొదలుపెడతారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఏపీలో నాలుగు రీజియన్లలో సభలు పెట్టి జనాలను ఎట్రాక్ట్ చేసింది. ఆ మీదట జగన్ జిల్లాలకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తారు. అదే విధంగా ఆయన కీలక నియోజకవర్గాలను కూడా పర్యటిస్తారు అంటున్నారు.

మొత్తం మీద చూస్తే రానున్న నెల రోజులలో రోజుకు మూడు నుంచి నాలుగు వంతుల సభలతో జగన్ ఏపీలో దాదాపుగా 120 నుంచి 130 అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా తిరుగుతారు అని అంటున్నారు. ఇక వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విషయంలో తుది కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. కొన్ని ప్రధాన వర్గాల వారికి హామీలు ఇస్తారు అని తెలుస్తోంది. అలాగే మేదరమెట్ట సభలోగానే వైసీపీ తన అభ్యర్ధుల పూర్తి జాబితాను రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు