Begin typing your search above and press return to search.

వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి రాజధాని...?

ఈ క్రమంలో అమరావతి రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతి అభివృద్ధి వైసీపీ అజెండాలో టాప్ ప్రయారిటీ అని చెప్పబోతోంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 2:30 AM GMT
వైసీపీ  మేనిఫెస్టోలో అమరావతి రాజధాని...?
X

వైసీపీ ఎన్నికల ప్రణాళికలో చాలా ఇంటరెస్టింగ్ ఇష్యూస్ ఉంటాయని ప్రచారం సాగుతోంది. ఏపీలో మరిన్ని టెర్ములు తామే అధికారంలో ఉండాలని వైసీపీ అధినాయకత్వం గట్టిగా తలపోస్తోంది. అందువల్ల అయిదు కోట్ల మంది ప్రజానీకం లో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా అసంతృప్తికి లోను కాకుండా అందరికీ తమతో కలుపుకుని కనెక్ట్ చేసుకుని ముందుకు సాగాలని వైసీపీ డిసైడ్ అయింది.

దాంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టో నవరసభరితంగా ఉండబోతోంది అని తెలుస్తోంది. ఎలా అంటే వైసీపీ మీద గడచిన నాలుగైదేళ్ళుగా ఆందోళనలు చేస్తూ గిట్టని వర్గాలు కూడా మెచ్చుకునేలా. వారికి కూడా నిండైన భరోసా దక్కేలా. అలా కనుక చూస్తే అమరావతి ఇష్యూ వైసీపీని ఇబ్బంది పెడుతోంది అన్నది తెలిసిందే. అమరావతి రాజధాని ఉద్యమం ప్రభావం అటు గుంటూరు, ఇటు క్రిష్ణా జిల్లాల మీద ఉంటుందని కూడా అంటున్నారు.

గత ఎన్నికల్లో నూటికి తొంబై శాతం సీట్లు ఈ రెండు జిల్లాలలో వైసీపీ పరం అయ్యాయి. కానీ ఈసారి అలా జరగదని సీట్లు తగ్గుతాయని అంటున్నారు. దాంతో వైసీపీ ఇపుడు రూట్ మారుస్తోంది. ఆ జిల్లాలలో పట్టు నిలుపుకుని గత ఎన్నికల మ్యాజిక్ నే రిపీట్ చేయాలని చూస్తోంది. దాంతో అమరావతి ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో హామీలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో అమరావతి రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతి అభివృద్ధి వైసీపీ అజెండాలో టాప్ ప్రయారిటీ అని చెప్పబోతోంది. శాసన రాజధాని అక్కడే ఉంటుందని, దాంతో పాటుగా అమరావతిని అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని కూడా హామీ ఇవ్వబోతోంది అని అంటున్నారు అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదని కూడా చాటి చెప్పబోతున్నారు.

దీని మీద వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. అమరావతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు. అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు కట్టుకున్నారు అంటే అభిమానంతోనే అని ఆయన అంటున్నారు. అదే విధంగా తమ ప్రభుత్వ అజెండాలో అమరావతి కీలకంగా ఉందని చెప్పారు.

విపక్షాలు కేవలం అమరావతి మాత్రమే అంటూంటే తాము మాత్రం ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమలతో కలుపుకుని మూడు ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేయబోతున్నామని చెప్పారు. జగన్ అమరావతికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కానే కాదని మంత్రి స్పష్టం చేశారు.

దీన్ని బట్టి చూస్తే వైసీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం ఉంటుందని, అందులో అమరావతికి కూడా పెద్ద పీట వేయబోతున్నారు అని స్పష్టం అవుతోంది. మంత్రి మాటలను బట్టి చూస్తే ఎన్నికల్లో రాజధాని ఇష్యూ కీలకం కాబోతోంది అని అంటునారు. సో వైసీపీ కొత్త లెక్కలతో ముందుకు వస్తోంది అన్న మాట.