Begin typing your search above and press return to search.

తొమ్మిది మంది వైసీపీ మంత్రులకు టికెట్లు లేవా...?

దాంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో తెలియక మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ అంతా తెగ టెన్షన్ పడుతున్నారు

By:  Tupaki Desk   |   8 Dec 2023 1:30 PM GMT
తొమ్మిది మంది వైసీపీ మంత్రులకు టికెట్లు లేవా...?
X

బిఆర్ఎస్ ఓటమి కాదు కానీ ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా తెలంగాణా ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ భారీ సంస్కరణలు చేపడుతుందని ప్రచారం సాగుతోంది. పెద్ద ఎత్తున సిట్టింగులకు సీట్లు చిరిగిపోయే ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి.

దాంతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందో తెలియక మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ అంతా తెగ టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే మొత్తం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పాతిక మంది మంత్రులలో తొమ్మిది మంది దాకా ఈసారి టికెట్లు దక్కవని ఒక లెవెల్ లో టాక్ వినిపిస్తోంది. అంటే నలభై శాతం మంది అన్న మాట. మరి మంత్రులలోనే ఇంత పెద్ద ఎత్తున టికెట్ల కోత ఉంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆలోచిస్తూ వైసీపీలో కీలక నేతలు అంతా పరేషాన్ అవుతున్నారు అని తెలుస్తోంది.

ఇక వైసీపీలో చూస్తే ఏకమొత్తంగా ప్రక్షాళన చేయాలని వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగా లేకున్నా టికెట్ మీద పూర్తి స్థాయిలో ఆశ వదులుకోవాల్సిందే అని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కుదరకపోతే కూడా టికెట్ కి ఢోకా ఏర్పడినట్లే అంటున్నారు.

ఇక ఈ ప్రచారంలోనే భాగంగా తొమ్మిది మంది మంత్రులకు టికెట్లు ఈసారి ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఇక వీరిలో ఎవరికైనా మొహమాటం మీద కానీ అధినాయకత్వంలో సాన్నిహిత్యం వల్ల కానీ టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే మాత్రం వారికి సీటు మార్చి వేరే చోటన పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అంటే ఉన్న చోట మాత్రం టికెట్ దక్కదు ఇవ్వరు అన్నది సుస్పష్టంగా తెలుస్తోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పార్టీ చేయించుకున్న అనేక సర్వేలలో తొమ్మిది మంది మంత్రులు ప్రజాదరణలో వెనకబడ్డారని అంటున్నారు. దాంతో వారికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉండకపోవచ్చు అని నివేదికలు అందాయని అంటున్నారు. ఇక వై నాట్ 175 అన్న స్లోగన్ ఎటూ ఉంది. అలాగే మరోసారి ఏపీకి జగన్ సీఎం కావాలీ అంటే కనుక భారీ ఎత్తున సీట్ల విషయంలో కోత పెట్టక తప్పదని అంటున్నారు.

ఈ పరిణామాలాతో మంత్రులలో సైతం కొత్త టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. ఇక మంత్రులలో టికెట్ రాని వారు ఎవరు అన్న ఆరా కూడా మొదలైంది. అలా చూస్తే కనుక ఉత్తరాంధ్రా నుంచి ఇద్దరు మంత్రులకు టికెట్లు దక్కవని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలో మరో ఇద్దరు ఉన్నారని టాక్. ఇక కోస్తాలో ఇద్దరు మంత్రులు ఉంటే రాయలసీమ జిల్లాల నుంచి ముగ్గురు ఉన్నట్లుగా చెబుతున్నారు.

వీరిలో కొందరు సీనియర్లు, వైసీపీ అధినాయకత్వానికి కావాల్సిన వారు. దాంతో వారి విషయంలో వేరే విధంగా ఆలోచన చేసి సీటు మారుస్తారు అని అంటున్నారు. అలాగే ఎంపీ గా కూడా కొందరిని పంపించే యోచన ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఈ నెలఖారులోగా వైసీపీ ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ మరోసారి నిర్వహించి టికెట్లు రాని వారికి చెప్పాల్సిన మాట చెప్పేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఆయా చోట్ల కొత్త ముఖాలను కూడా చూసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.