Begin typing your search above and press return to search.

ఆ అధికారులపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

By:  Tupaki Desk   |   13 May 2024 1:54 PM GMT
ఆ అధికారులపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
X

ఏపీలో 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీ ఆర్పీ ఠాకూర్ లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీడీపీకి అనుకూలంగా పని చేసేలా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో వీరిద్దరూ కూర్చొని జిల్లాల పోలీసు అధికారులను ఫోన్లు చేసి వారిని ప్రభావితం చేస్తున్నారని తెలిపింది. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు కూడా పాల్పడ్డారని పేర్కొన్నది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక ఏపీలో ఈ రోజు పోలింగ్ సందర్భంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ సంధర్బంగా రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.