Begin typing your search above and press return to search.

జగన్ మార్కులు పొందిన వారికే ఫ్యూచర్

వైసీపీలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో జగన్ పదవులు ఇచ్చిన తీరు చూస్తే చేతికి ఎముక లేకుండా చాలా మందికి అందలాలు అందించారు అన్న మాట ఉంది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 11:00 AM IST
జగన్ మార్కులు పొందిన వారికే ఫ్యూచర్
X

వైసీపీలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో జగన్ పదవులు ఇచ్చిన తీరు చూస్తే చేతికి ఎముక లేకుండా చాలా మందికి అందలాలు అందించారు అన్న మాట ఉంది. అనర్హులకు కూడా పదవులు సునాయాసంగా దక్కేవి. అయితే విపక్షంలోకి వచ్చాక చూస్తే అసలు విషయం అర్ధం అయింది అంటున్నారు

పదవులు అందుకున్న వారు అంతా ఒక్కసారి సైలెంట్ అయ్యారు. ఏ పదవీ లేని వారు మాత్రం కాస్తా కనిపిస్తున్నారు. అంతే కాదు అవకాశాలు దక్కని వారే చురుకుగా ఉన్నారు. ఇక సన్నిహితులు బంధువులు మిత్రులు సఖులు ఇలా జగన్ చుట్టూ ఉన్న వారు ఆయనతోనే జీవితమంతా ప్రయాణం చేస్తారు అనుకున్న వారు అంతా ఏడాది కాలంలో పార్టీని వీడి షాక్ ఇచ్చారు.

దాంతో వైసీపీ అధినేతకు తత్వం బోధపడింది అని అంటున్నారు. ఎంతో మందికి పదవులు ఇచ్చినా ఈ రోజున వారు తమ దారి చూసుకున్నారు అని సన్నిహితులతో జగన్ అన్నారని కూడా ప్రచారంలో ఉంది. దాంతో జగన్ ఇపుడు ఒక కొలమానం పెట్టుకుని తానే స్వయంగా మార్కులు వేస్తున్నారు అని అని అంటున్నారు పార్టీ కష్టకాలంలో ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే సంక్షోభంలో ఉంది. దాంతో రానున్న నాలుగేళ్ళ పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తూ జనంలో ఉంటూ ఎవరైతే పటిష్టం చేస్తారో వారికే ప్రయారిటీ ఇవ్వాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఈ విషయంలో జగన్ వయసు కూడా చూడరని చెబుతున్నారు అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూర్ వెస్ట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు అని గుర్తు చేస్తున్నారు. పార్టీ కోసం గొంతుక వినిపించేవారికే ప్రాధాన్యత అని స్పష్టం చేస్తున్నారుట. అదే సమయంలో మౌనంగా ఉంటూ పార్టీకి మంచి రోజులు వస్తే అపుడు సౌండ్ చేద్దామని భావించే నాయకులకు సైతం చెక్ చెప్పడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు.

గోడ మీద పిల్లులు మాదిరిగా కొంతమంది నేతలు ఉంటూ వైసీపీకి ఊపు వస్తే అందులో కంటిన్యూ కావడం ఒకవేళ అలా కాకపోతే ఎన్నికల ముందు తమ దారి చూసుకోవడానికి వ్యూహం సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. అటువంటి నాయకులను ముందే వదిలించుకోవడమే మేలు అని తలపోస్తున్నారుట. వారి ప్లేస్ లో జూనియర్లకు చోటు కల్పించినా ఎన్నికల సమయానికి రాటు దేలుతారని దాంతో పార్టీ కూడా పటిష్టం అవుతుందని అంటున్నారు.

దీంతో టీడీపీకి వైసీపీకి మధ్య కొంతమంది పోలికలు తెస్తున్నారు టీడీపీలో యూత్ కే వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అదే వైసీపీలో అయితే వయసు అన్నది కొలమానం కానే కాదని జగన్ వైఖరి సంకేతలు ఇస్తోంది అంటున్నారు. విధేయత ప్రధాంగా వైసీపీలో ప్రాధాన్యతలు ఉంటాయని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీలో జగన్ వేసే మార్కులకు ఎంతమంది తూగుతారు అన్నదే చూదాల్సి ఉంది అని అంటున్నారు