Begin typing your search above and press return to search.

ఇది ముంచే ప్రభుత్వం.. టీడీపీ పై వైసీపీ కౌంటర్.. వీడియో వైరల్

దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు పాత పరిశ్రమల వద్ద హడావుడి చేస్తున్నారని, తామే వాటిని తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ విమర్శించింది.

By:  Tupaki Desk   |   13 April 2025 3:34 PM IST
ఇది ముంచే ప్రభుత్వం.. టీడీపీ పై వైసీపీ కౌంటర్.. వీడియో వైరల్
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ వేడి ఎప్పుడూ తగ్గదు.. తగ్గే అవకాశాలు కూడా లేవు. ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఫైట్ చేస్తూనే ఉంటాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి కౌంటర్‌గా టీడీపీ నేతలు పాత పరిశ్రమల వద్ద హడావుడి చేస్తున్నారని, తామే వాటిని తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారని వైసీపీ విమర్శించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఒక కార్టూన్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో టీడీపీ నేత నారా లోకేష్ పాత పరిశ్రమల వద్ద నాటకాలు ఆడుతున్నట్లు, తామే ఈ పరిశ్రమలను తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నట్లు చూపించారు. అంతేకాకుండా, టీడీపీకి అనుకూలమైన మీడియా ఈ విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తోందని కార్టూన్‌లో వ్యంగ్యంగా చూపించారు.

కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని నారా లోకేష్ కొనసాగిస్తున్నారని వైసీపీ ఈ కార్టూన్ వీడియో ద్వారా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో, ఈ కార్టూన్ వీడియోతో టీడీపీ వాదనను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది.

మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అయితే, వైసీపీ విడుదల చేసిన ఈ కార్టూన్ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.